Stomach Cleaning In 2 Days: మనిషి కడుపు ఆరోగ్యంగా ఉంటే.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలా మంది ఆధునిక జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇదే క్రమంలో చాలా మందిలో పెద్ద ప్రేగులో తీవ్ర సమస్యలు కూడా వస్తున్నాయి. దీని కోసం ఆ ప్రేగులను శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో వ్యాధులు ఉత్పన్నం కావడానికి ప్రధాన కారణాలు ఇదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రేగులను శుభ్రం చేసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియ వ్యవస్థ పుంజుకుంటుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ఇలా చేయండి:
గోరువెచ్చని నీరు:
పేగులను శుభ్రంగా ఉంచడానికి గోరువెచ్చని నీరు ప్రభావవంతంగా మేలు చేస్తుంది. అయితే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కనీసం 2 గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేస్తే.. సహజంగా పొట్టను శుభ్రం అవ్వడమే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
పాలు:
పాలలో శరీరానికి కావాల్సిన అన్ని ప్రోటిన్లు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం దృఢంగా మారుతుంది. అయితే ప్రతిరోజూ ఉదయం అల్పాహారం సమయంలో తప్పనిసరిగా ఒక గ్లాసు పాలు తాగాలి. పాలలో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలను దూరం చేస్తుంది.
వెజిటబుల్ జ్యూస్:
వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల పేగులు శుభ్రపడతాయి. అంతేకాకుండా పొట్టలో మలినాలు సులభంగా తొలగిపోతాయి. ఈ క్రమంలో తప్పకుండా బీట్‌రూట్, అల్లం, పొట్లకాయ, టమోటా, బచ్చలికూర మొదలైన వాటి రసాన్ని తాగవచ్చు.
అధిక ఫైబర్ ఉన్న కూరగాలు:
తీసుకునే ఆహారంలో తప్పకుండా యాపిల్, ఆరెంజ్, దోసకాయ, కలబంద వంటి అధిక ఫైబర్ ఉన్న కూరగాయాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్ట సులభంగా శుభ్రంగా మారుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook