Healthy Lifestyle: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యవంతమైన జీవనానికి 6 సూత్రాలు..

Healthy Lifestyle: ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ఎలాంటి అలవాట్లు పాటించాలి? వ్యాయామం, ఆహారం, నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? నిపుణుల సలహాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 06:33 PM IST
  • ఇంటి నుంచి పని చేస్తూన్న వారికి ఆరోగ్య సలహాలు
  • ఒత్తిడిని జయించేందుకు సులభమైన మార్గాలు
  • ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
Healthy Lifestyle: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యవంతమైన జీవనానికి 6 సూత్రాలు..

Healthy Lifestyle: ప్రస్తు పోటీ ప్రపంచంలో ఎంతో మంది రోజువారీ జీవితంలో బిజీగా గడుపుతుంటారు. క్షణం కూడా తీరిక లేకుండా.. ఉరుకులూ పరుగులతో గడిపేస్తుంటారు. కొంత మంది నిద్రాహారాలు మాని మరీ ఎప్పుడూ ఏదో ఓ పని చేస్తుంటారు. ఇలా బిజీ లైఫ్​లో పడి చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించడం మరిచిపోయారు. ఫలితంగా 30 ఏళ్లకే రకరకాల రోగాల బారిన పడుతున్నారు.

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?

ప్రపంచంతో పాటు పోటీ పడి ముందుకు సాగటం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయమని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇదే సమయంలో ప్రతి వ్యకీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలని చెబుతున్నారు. ఆరోగ్యం సహకరించనప్పుడు.. ఎంత సంపాదించినా దానిని ఆస్వాధించలేరని అంటున్నారు.
ఇందుకోసం ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం కోసం కూడా ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆరోగ్యమైన జీవనం కోసం చేయాల్సిన ముఖ్యమైన పనులు..

ప్రతి రోజూ వ్యాయామం: కరోనా తర్వాత చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీనితో కనీసం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే.. తినడం, పనిచేయడం, పడుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే ఇది సరైన పద్దతి కాదంటున్నారు ఆరోగ్య నిపణులు.

ఇందుకోసం ప్రతి రోజు ఉదయం లేవగానే రన్నింగ్, జాగింగ్ వంటివి చేయాలన చెబుతున్నారు. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటే.. ఇంట్లోనే వీలైన వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. క్రమం తప్పకుండా వీటిని చేయడం ద్వారా.. పని ఒత్తిడి దూరమై, ప్రతి రోజూ కొత్తగా ప్రారంభిస్తారని చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుందని చెబుతున్నారు.

తరచూ నీళ్లు తాగటం..

శరీరంలో అన్ని క్రియలు సరిగ్గా జరగాలంటే నీరు చాలా అవసరం. అందుకే తరచూ నీళ్లు తాగటం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సరిపడా నీళ్లు తాగడం వల్ల చర్మ కూడా నిగ నిగలాడుతూ.. ఆరోగ్యవంతగా ఉంటుందని చెబుతున్నారు.

ఆహారంపై దృష్టి పెట్టండి..

ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చాలా మంది ఓ టైం అంటూ లేకుండా తింటుంటారు. అంతే కాకుండా టైమ్ పాస్​కోసం స్నాక్స్ అంటూ జంక్​ ఫుడ్​ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

అందుకే రోజు టైమ్​ టేబుల్ ఫిక్స్ చేసుకుని.. బ్రేక్​ ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​ మధ్యలో స్నాక్స్​ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. తినే ఆహారంలోను రుచితో పాటు పోషకాలు కూడా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

ఒత్తిడికి లోనవకుండా చూసుకోవాలి..

ఇంట్లోనే ఉండటం వల్ల చాలా మందికి ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతుండటం సాధారణ సమస్యగా మారింది. ఇందుకోసం ఒత్తిడిగా అనిపించినప్పుడు కాసేపు పనిని పక్కన పెట్టి.. ఇంట్లో వాళ్లతో మాట్లాడటం కాసేపు ప్రకృతిని ఆస్వాధించడం వంటివి చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఫోన్​ ఎక్కువగా వాడకపోవడమే మంచిది..

చాలా మంది ఫోన్​ వాడుతూ టైమ్​ ఎంత సేపు గడిచించో కూడా పట్టించుకోరు. అందుకే ఫోన్​ను ఎంత సేపు వాడుతున్నాం అనే విషయంపై దృష్టి సారించాలి.
నిద్రకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి..

ప్రతి రోజు యాక్టివ్​గా ఉండాలంటే నిద్ర అనేది చాలా అవసరం. రోజూ 8 గంటలు నిద్రపోడవం వల్ల శరీరానికి కావాల్సినంత రెస్ట్ దొరుకుతుంది. దీని ద్వారా మరుసటి రోజు ఫ్రెష్​గా స్టార్ట్ చేయొచ్చు.

Also read: WhatsApp Tricks: మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి మెసేజ్ చేయాలా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!

Also read: Omicron Symptoms: ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో రెండు కొత్త ప్రాణాంతక లక్షణాలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News