Side Effects of Onion: ఉల్లిపాయలో శరీరానికి ప్రయోజనాలు ఉండే అనేక రకాల పోషక విలువులుంటాయి. అంతేకాకుండా వీటిని వంటలు వండే క్రమంలో వినియోగిస్తే ఆహారం మరింత రుచిగా మారుతుంది. అయితే వీటిని తరచుగా తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో.. అన్ని రకాల దుష్ప్రభావాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఉల్లిపాయాలను అతిగా వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీటిని కట్ చేసి క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉల్లిపాయల్లో అతిగా తింటే ఈ సమస్యలు తప్పవు:
1. ఉల్లిపాయల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధిక పరిమాణంలో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. కనుక జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎసిడిటీ సమస్య రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు వీటిని తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
3. పచ్చి ఉల్లిపాయలో రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచేందుకు కృషి చేస్తుంది. కావున డయాబెటిక్ పేషెంట్లు వీటిని తినకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.
4. ఉల్లిపాయలను అతిగా తినడం వల్ల గుండెల్లో మంట రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
5. సాధరణ వ్యక్తులు అతిగా ఉల్లిపాయలను ఎప్పుడూ తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికమని నిపుణులు సూచిస్తున్నారు.
6. వీటిని అతిగా తినడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Paratha Recipe: ఉదయాన్నే దీనితో చేసిన పరాటా తింటే.. రోజంతా శరీరం అక్టివే..!
Read also: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook