Haircare Tips: ఒత్తైన మందపాటి జుట్టు కావాలా? షహనాజ్ హుస్సేన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి..

Haircare Tips:  జుట్టు మందంగా, పొడుగ్గా ఉంటేనే అందంగా కనిపిప్తారు. కానీ, ఈ కాలంలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని రెమిడీస్ మనం ఇంట్లోనే ప్రయత్నిస్తే జుట్టు ఊడటం తగ్గిపోయి మందంగా పెరుగుతుందంటున్నారు సౌందర్య నిపుణురాలు షహనాజ్ హుస్సేన్.. అవేంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Feb 18, 2024, 08:09 AM IST
Haircare Tips: ఒత్తైన మందపాటి జుట్టు కావాలా? షహనాజ్ హుస్సేన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి..

Haircare Tips:  జుట్టు మందంగా, పొడుగ్గా ఉంటేనే అందంగా కనిపిప్తారు. కానీ, ఈ కాలంలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని రెమిడీస్ మనం ఇంట్లోనే ప్రయత్నిస్తే జుట్టు ఊడటం తగ్గిపోయి మందంగా పెరుగుతుందంటున్నారు సౌందర్య నిపుణురాలు షహనాజ్ హుస్సేన్.. అవేంటో తెలుసుకుందాం.

జుట్టు ఊడిపోవడానికి కారణాలు..
జుట్టు ఊడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా వయస్సు, హార్మోనల్ మార్పులు, హెయిర్ జాగ్రత్తలు పాటించకపోవడం వంటివి. అంతేకాదు కెమికల్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులు వాడటం,  తరచూ జుట్టుకు రంగు వేసుకోవడం,జుట్టును గట్టిగా కట్టేయడం వంటివి జుట్టు ఊడటానికి కారణమవుతాయి.జన్యుపరమైన మార్పులు కూడా జుట్టు ఊడటానికి కారణం. మీ కుటుంబంలో ఇలా హెయిర్ సమస్యలు ఉంటే మీకు ఈ సమస్యలు వెంటాడుతాయి. అంతేకాదు మీ ఆహారంలో విటమిన్ ఏ, డీ, ఈ, బీ, ఐరన్, ప్రొటీన్ కంటెంట్ తక్కువగా ఉన్నా జుట్టు బలహీనంగా మారి ఊడిపోతుంది. అందుకే మీ ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, చేప, గింజలు, విత్తనాలు వంటివి ఉండేలా చూసుకోవాలి.

ఇదీ చదవండి: Fat Burning Smoothies: తింటూనే బరువు తగ్గాలా? ఈ 3 స్మూథీస్ కొవ్వును తక్షణమే కరిగించేస్తాయట..

జుట్టు పెరుగుదలకు హోం రెమిడీస్..
హెయిర్ వాష్..

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి హెయిర్ ఫాల్ ను తగ్గిస్తాయి. గ్రీన్ టీ వేడిచేసి చల్లబరచాలి. ఆ తర్వాత తలకు షాంపూ చేసిన తర్వాత ఈ టీ నీళ్లతో జుట్టును కడగాలి. మృదువుగా మసాజ్ చేయాలి. ఓ పదినిమిషాల తర్వత మళ్లీ నీళ్లతో కడిగేసుకోవాలి. దీన్ని మీరు వారానికి రెండుసార్లు కూడా ప్రయత్నించవచ్చు.

ఆముదం..
ఆముదంలో రైసినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్ప్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కుదుళ్లు ఆరోగ్యంగా ఉంచి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. ఆముదం నునెను వేడిచేసి కుదుళ్ల నుంచి జుట్టుకు మొత్తగానికి మసాజ్ చేయాలి. దీన్ని ఓ గంట లేదా రాత్రంతా అలాగే ఉంచి హెయిర్ వాష్ చేయాలి. ఇది వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.

మెంతుల మాస్క్..
మెంతుల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ పెరుగుదలకు, బలానికి మంచివి. రాత్రంతా మెంతులను నీళ్లలో నానబెట్టి ఉదయం వాటిని గ్రైండ్ చేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్లు, వెంట్రుకలకు అప్లై చేసి ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. 

ఇదీ చదవండి: Snacking in Bed: మీరూ బెడ్‌పై కూర్చొని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ సమస్యలు తప్పవు..

ఎగ్ మాస్క్..
గుడ్డు జుట్టుకు మెరుపునిస్తుంది. ఇందులో లిసిథిన్ అనే ప్రత్యేకమైన ఫ్యాట్ ఉంటుంది. ఇది జుట్టును మాయిశ్చర్ గా ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. తులసి ఆకులను పొడిచేయాలి, ఇందులో ఓ గుడ్డు పూర్తిగా వేసి కలపాలి. మాస్క్ లా తయారు చేసి జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఓ 40 నిమిషాల తర్వాత టవల్ ను వేడినీటిలో ముంచి గట్టిగా పిండాలి. దీన్ని జుట్టుకు కట్టేసుకోవాలి. ఇలా జుట్టుకు స్టీమ్ ఇవ్వాలి. ఆ తర్వాత షాంపూతో స్నానం చేసుకోవాలి..(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News