Rock Salt For Blood Pressure And Joint Pain: మనం తినే ఆహారాల్లో ఉప్పు లేకుండా ఉంటే అస్సలు తినం. మన తెలుగు సామెతలలో 'నల భీమ పాకం వండిన ఉప్పు లేకపోతే రుచికరంగా వుంటుందా' అని అన్నారు. మనం తినే ఉప్పు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలుసా? అవును అతిగా ఉప్పు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పును కేవలం తగిన మోతాదులో వినియోగిస్తేనే శరీరానికి అయోడిన్ లభిస్తుంది. ఇది బ్రెయిన్ పనితీరును మెరుగు పరచడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది హైబీపీ, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఉప్పును అతిగా తినడం వల్లేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్‌ను తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనిని తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రాక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ఫలితాలు:
1. బ్లడ్ ప్రెషర్:
గుండెకు సంబందించిన సమస్యలతో బాధపడుతున్న వారికి రాక్ సాల్ట్ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు అధిక కొలెస్ట్రాల్ కూడా తగ్గించడమేకాకుండా గుండె పోటు సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఆహారంలో రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంచుతుంది.
2. గొంతు నొప్పి:
ఆయుర్వేదంలో రాక్ సాల్ట్‌కు చాలా ప్రధాన్యత ఉంది. తీవ్ర గొంత నొప్పి వచ్చినప్పుడు చిటికెడు వాపు, రాక్ సాల్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
3. కీళ్ల నొప్పు:
రాక్ సాల్ట్‌లో వుండే మినరల్స్ కీళ్ల నొప్పి, తిమ్మిరిల నుంచి ఉపశమనం పొందడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా కాళ్ళు దృడంగా ఉంచడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
4.జీర్ణక్రియ:
మలబద్ధక సమస్యలతో బాధపడుతున్న వారు రాక్ సాల్ట్ ప్రతి రోజు తీనే ఆహారంలో వాడడం వల్ల అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.