Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో పదొన్నతి, వ్యాపారస్తులకు లాభం

నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. కొంతమంది ఉద్యోగులకు పదొన్నతులు లభించే అవకాశం ఉందని.. ఇంకొన్ని రాశుల వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురుకానున్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 11, శనివారం నాటి మీ రాశి ఫలాలు చదవాల్సిందే.

Last Updated : Apr 11, 2020, 12:40 PM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో పదొన్నతి, వ్యాపారస్తులకు లాభం

నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. కొంతమంది ఉద్యోగులకు పదొన్నతులు లభించే అవకాశం ఉందని.. ఇంకొన్ని రాశుల వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురుకానున్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 11, శనివారం నాటి మీ రాశి ఫలాలు చదవాల్సిందే.

ఏప్రిల్ 11, శనివారం నాటి మీ రాశి ఫలాలు 

మేష రాశి 11 ఏప్రిల్ 2020 ( మేష రాశి వారి జాతకం )
ఇవాళ మీపై మీకు ఉన్న బలమైన ఆత్మ విశ్వాసం కారణంగా మీరు చాలా క్లిష్టమైన పనులలోనూ విజయం సాధించే అవకాశాలున్నాయి. అదే సమయంలో ధనం, వ్యాపార విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు కెరీర్‌లో ముందుకు సాగడానికి అవకాశాలు ఉన్నాయి. సమాజంలో సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మీ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది.

వృషభ రాశి 11 ఏప్రిల్ 2020 ( వృషభ రాశి వారి జాతకం )
ఈ రోజంతా మీ చేతిలో చాలా పని ఉంటుంది. కొంతమంది మీ ద్వారా వాళ్ల పనిని పూర్తి చేయించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మనసులో చికాకుల కారణంగా పనిపై దృష్టి పెట్టడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. మీ మనసులో మాటను మీ భాగస్వామి వద్ద దాచే ప్రయత్నం చేయొద్దు. ఆరోగ్యరీత్యా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు చికాకు పెడతాయి. 

మిథున రాశి 11 ఏప్రిల్ 2020 ( మిథున రాశి వారి జాతకం )
వ్యాపారం, ఉద్యోగంలో కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. పనిచేసే చోట ఎప్పటికంటే ఎంతో జాగ్రత్తగా ఆచితూచీ మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తోంది. అభివృద్ధి ద్వారాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంట్లో ఉపయోగించే ఏవో కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. మీ ఆలోచనా విధానాన్ని పాజిటివ్‌గా ఉండేలా చూసుకోండి. నమ్మదగిన వ్యక్తి నుంచి సహకారం పొందే అవకాశాలున్నాయి. మీ భాగస్వామి మానసిక స్థితి అంతగా అనుకూలంగా ఉండదు. మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవిస్తారు. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కర్కాటక రాశి 11 ఏప్రిల్ 2020  ( కర్కాటక రాశి వారి జాతకం )
కొత్త వ్యాపారం చేసే ఆలోచనలు చేస్తారు. ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక కూడా కలుగుతుంది.

సింహ రాశి 11 ఏప్రిల్ 2020 ( సింహ రాశి వారి జాతకం )
వ్యాపారంలో సరికొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. నిలకడగా ధనం సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఒకరి నుండి ధనం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఈ రోజు మీ కోరికలు ఏవైనా అవి నెరవేరుతాయి. ఒంటరిగా ఉండే వ్యక్తులకు ఇవాళ మంచి రోజు కానుందని సింహ రాశి చెబుతోంది.

కన్యా రాశి 11 ఏప్రిల్ 2020 ( కన్యా రాశి వారి జాతకం )
ఉద్యోగాలు, వ్యాపారం గురించి నిర్ణయాలు తీసుకోకండి. వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పాత వివాదం ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. కుటుంబ సమస్యలు అలాగే ఉంటాయి. మానసిక ఇబ్బందులు పెరుగుతాయి. దగ్గరి బంధువులతో దాదాపు విసిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు కొంత మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశాలున్నాయి.

తులా రాశి 11 ఏప్రిల్ 2020 ( తులా రాశి వారి జాతకం )
మీరు అప్పుల నుండి బయటపడవచ్చు. మీ పనిపై పూర్తి దృష్టి పెట్టండి. పనిచేసే చోట అధికారుల సహకారం ఉంటుంది. ఒక ప్లాన్ ప్రకారం పనిచేస్తే ఫలితం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఇబ్బందులు తప్పవు. మీ ప్రవర్తన పట్ల మీ భాగస్వామి సంతోషం వ్యక్తంచేస్తారు. 

వృశ్చిక రాశి 11 ఏప్రిల్ 2020 ( వృశ్చిక రాశి వారి జాతకం ) 
వ్యాపారం బాగా జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా భావించే కొన్ని పనులు ఇవాళ పూర్తవుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడి ప్రణాళికలు చేయవచ్చు. ఇవాళ మీకు కొంత విశ్రాంతి లభిస్తుంది.

ధనుస్సు రాశి 11 ఏప్రిల్ 2020 ( ధనుస్సు రాశి వారి జాతకం )
ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీకు ఏవైనా సొంత వ్యాపారాలు ఉన్నట్టయితే.. ఇవాళ ఆ వ్యాపారంపైనే దృష్టిసారిస్తారు. వ్యాపారం, పనికి సంబంధించిన సమస్యలు ముగుస్తాయి. అనవసరమైన ఇబ్బందులు అంతం కావచ్చు. మీకు మంచి రోజు ఉంటుంది. ఇంట్లో వాతావరణం సంతోషంగా, మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి, వైవాహిక జీవితానికి ఈరోజు మంచిది. అలసట లేదా ఒత్తిడి లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు.

మకర రాశి 11 ఏప్రిల్ 2020 ( మకర రాశి వారి జాతకం )
ఇవాళ దూరపు బంధువుల నుంచి ఏదైనా ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. గతంలో దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. వ్యాపారం కలవారికి ఆశించిన స్థాయిలో లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు పదొన్నతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ, కళా రంగాల వారికి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. ఐటి రంగాల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయి. విద్యార్థులు కూడా సంతోషంగా గడుపుతారు. మహిళల అంచనాలన్నీ నిజం అవుతాయి. మకర రాశి వారు పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఎప్పటికన్నా కొంచెం జాగ్రత్తలు అవసరం. లేదంటే ఇబ్బందులు తప్పేలా లేవు. 

కుంభ రాశి 11 ఏప్రిల్ 2020 ( కుంభ రాశి వారి జాతకం )
ఈ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గృహములు, వాహనములు కొనుగోలు చేస్తారు. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నాయి. వీరు చేసే ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగాల వారికి కూడా నూతన అవకాశాలు లభిస్తాయి. ఎవరికైనా ధన సహాయం చేయాల్సి వస్తే... కాస్తా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

మీన రాశి 11 ఏప్రిల్ 2020 ( మీన రాశి వారి జాతకం )
ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. బంధువులతో కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన పనుల్లో అవాంతారాలు ఏర్పడుతాయి. స్నేహితుల నుంచి కూడా విమర్శలు తప్పకపోవచ్చు. వ్యాపారంలో ఉండే వారు ఇవాళ కొత్త ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రాశి కలిగిన వ్యాపారస్తులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగం, విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

సర్వేజనా సుఖినోభవంతు.

Trending News