Oats Facts In Telugu: కొంతమంది అయితే ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా ఓట్స్ తింటూ ఉంటారు. నిజానికి రోజు ఓట్స్ తినడం మంచిదేనా? తింటే ఏమవుతుంది? చాలామంది ప్రస్తుతం మూడు పూటలా ఓట్స్ తింటున్నారు నిజానికి ఇలా తినడం మంచిది కాదు రోజు ఉదయం అల్పాహారంలో భాగంగా లేదా రాత్రి డిన్నర్ లో భాగంగా ఓట్స్ను చేర్చుకోవడం ఎంతో మంచిదని అతిగా తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రోజు ఉదయం అల్పాహారం లో భాగంగా తప్పకుండా ఓట్స్ ఉండేటట్లు చూసుకోండి. అలాగే ఓట్స్ బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతో సహాయపడతాయి. కాబట్టి ఫ్రూట్స్ తో తయారు చేసిన సలాడ్ లో భాగంగా ఓట్స్ వినియోగించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతే కాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర మెటబాలిజాన్ని పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి రోజు కేవలం ఒక్కసారి ఓట్స్ తినడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు. అయితే ఓట్స్ తినడం వల్ల కలిగే ఇతర లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఓట్స్ తినడం వల్ల కలిగే అద్భుత లాభాలు:
గుండె సమస్యలు రావు:
రోజు ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇందులో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతోపాటు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి గుండె జబ్బులను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
శరీర బరువు నియంత్రణ:
చాలామంది అధిక బరువు పెరగడం కారణంగా బరువు తగ్గేందుకు వివిధ రకాల వ్యాయామాలతో పాటు ఖర్చులతో కూడుకున్న చికిత్సలను ఆశ్రయిస్తున్నారు నిజానికి ఇవన్నీ లేకుండా కూడా సులభంగా బరువు తగ్గొచ్చు రోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా ఓట్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా బరువు కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది.
మధుమేహానికి చెక్:
చాలామంది యుక్తవయసులోనే మధుమేహం సమస్యల బారిన పడుతున్నారు ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఓట్స్ ఎంతగానో సహాయపడతాయి ఇందులో ఉండే కొన్ని గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి పెంచుతుంది:
ఓట్స్ లో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ప్రతిరోజు వీటిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీర శక్తి ఒక్కసారిగా పెరుగుతుంది అంతే కాకుండా ఇందులో లభించే ఫైబర్ జీర్ణక్రియ సమస్యలను పోగొట్టేందుకు కూడా సహాయపడుతుంది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
చర్మ సమస్యలు రాకుండా:
ఓట్స్ రోజు తినడం వల్ల చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుందని దీనివల్ల చర్మ సమస్యలు రాకుండా కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తరచుగా చర్మ సమస్యలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఓట్స్ను ఆహారంలో తీసుకోండి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.