IRCTC Tour Packages: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైత్ర నవరాత్రులు ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో యాత్రికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మీరు నవరాత్రి సమయంలో మాతా వైష్ణో దేవిని సందర్శించాలనుకుంటే.. మీ కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో.. వైష్ణో దేవి మాత్రమే కాకుండా ఇతర దేవి ఆలయాలు కూడా సందర్శించుకోచ్చు. మీరు కేవలం 10 వేల రూపాయలతో 5 దేవాలయాలను సందర్శించవచ్చు. నవరాత్రులలో ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు కుటుంబ సమేతంగా దేవి ఆలయాలను దర్శించుకోచ్చు. భక్తులు జ్వాలాజీ, చాముండ, చింత్‌పూర్ణి, మాతా వైష్ణో దేవి, కాంగ్రా దేవిలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ 5 పగలు, 6 రాత్రులు ఉండనుంది.
మీరు రెండు తేదీలలో దేవి ఆలయాన్ని సందర్శించవచ్చు. భక్తులు తమ సౌకర్యాన్ని బట్టి ఆలయాలను సందర్శించే తేదీలను ఎంచుకోవచ్చు. ఈ ఐదు దేవతల టూర్ ప్యాకేజీ మార్చి 22న ప్రారంభమవుతుంది. రెండవ ప్రయాణాన్ని మార్చి 29న ఆరంభంకానుంది. ఈ రెండు తేదీల్లో భక్తులు ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ప్రయాణం రైలు మోడ్ ద్వారా ఉంటుంది. ఈ యాత్ర జైపూర్ నుంచి ప్రారంభం కానుంది. బండికుయ్ జంక్షన్, రాజ్‌గఢ్, అల్వార్, అజ్మీర్ జంక్షన్, కిషన్‌గఢ్, ఫూలేరా జంక్షన్, జైపూర్, గాంధీనగర్ జేపీఆర్, దౌసా, ఖైర్తాల్, రేవారి, గుర్గావ్, ఢిల్లీ కాంట్, ఢిల్లీ, కర్నాల్, అంబాలా కాంట్ జంక్షన్ నుంచి భక్తులు తమ సౌకర్యాన్ని బట్టి రైలు ఎక్కవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీలో మీరు థర్డ్ ఏసీ, స్లీపర్‌లో ప్రయాణించవచ్చు. థర్డ్ ఏసీలో ఒక్కో వ్యక్తికి రూ.17,735 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులతో ప్రయాణించడానికి ఒక్కొక్కరికి రూ.14,120, ముగ్గురితో ప్రయాణించడానికి రూ.13,740 పే చేయాలి. స్లీపర్‌లో ప్రయాణించడానికి ఒక్కొక్కరికి రూ.14,735, ఇద్దరు వ్యక్తులతో ప్రయాణించడానికి రూ.11,120, ముగ్గురు వ్యక్తులతో ప్రయాణించడానికి రూ.10,740 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులకు వసతి, ఆహార సౌకర్యాలను ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి సమాచారాన్ని మరింత తెలుసుకోవడానికి.. బుకింగ్ కోసం మీరు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.
Also Read: Facebook Layoffs: మెటా సంచలన నిర్ణయం.. 10 వేల ఉద్యోగాలు తొలగింపు..!
Also Read: Viral Video: డబ్బుల వర్షం.. నోట్ల కట్లను రోడ్డుపైకి విసిరేశాడు.. వీడియో చూస్తే షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి