Muscles Building Tips: ప్రస్తుతం ఉన్న రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో పురుషులు మంచి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. దీని కారణంగా వారి శరీరం బలహీనంగా మారి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రతి ఒక్కరూ వారు శరీరకంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే దీని కోసం మంచి ప్రోటీన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ మంచి ఆహారం తీసుకుంటే వ్యక్తి రోజంతా శక్తివంతంగా ఉంటాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పురుషులు దృఢంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలను క్రమం తప్పకుండా తినాలి:
మారుతున్న జీవన శైలి కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్, కొలెస్ట్రాల్, షుగర్, మైగ్రేన్ వంటి అనేక వ్యాధులు పురుషులలో వస్తున్నాయి. ఈ కారణంగానే వారు ఫిట్‌గా ఉండలేకపోతున్నారు. అయితే ఆహారంలో 5 రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. కొవ్వు గల చేపలు:
చేపలలో ప్రొటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. అంతేకాకుండా జుట్టుకు మేలు చేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల గుండె, కండరాలు బలంగా మారతాయి.
2. పాలు:
పాలు కాల్షియం వంటి పోషకాలుంటాయి. కావున ఇవి ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. రోజూ పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పాలలో అధిక మోతాదుల్లో విటమిన్లు ఉండడం వల్ల శరీరంలో మెగ్నీషియం, పెప్టైడ్‌లు గ్లూకోజ్, ఇన్సులిన్ సెన్సిటివిటీని సమతుల్యంగా చేస్తాయి.
3. గుడ్లు:
గుడ్లలో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు, కేలరీలు, సోడియం, పొటాషియం, అలాగే ఐరన్, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ B6, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయి.
4. గ్రీన్ వెజిటెబుల్స్:
పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో అనేక రకాల పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
5. గింజలు, విత్తనాలు:
గింజలు, విత్తనాలు ఎల్లప్పుడూ శరీరానికి మేలు చేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!
Also Read: Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook