Health Benefits of Eating Curd: ఆరోగ్యానికి మేలు చేసేవాటిలో పెరుగు కూడా ఒకటి. అయితే కొందరు జలుబు చేస్తుందోమోనని భయంతోనూ, బరువు పెరుగుతారనే అనుమానంతోనూ పెరుగు తినడానికి వెనుకాడతారు. అయితే పెరుగు తినడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. ఇందులో ఉండే బ్యాక్టీరియా బాడీకి ఎంతో మేలు చేస్తుంది. దీనిని మజ్జిగ చేసుకుని తాగితే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. రోజువారీ ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
పెరుగు తినడం వల్ల లాభాలు
** పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్లు తలెత్తవు.
** డైలీ పెరుగు తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
** రోజూ పెరగడం తినడం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు రావు.
** పెరుగులో కాల్షియం, భాస్వరం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలు గట్టిపడేలా చేస్తాయి.
** పెరుగులో కాస్తా మిరియాల పొడి వేసుకుని తింటే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
** కప్పు పెరుగు తింటే ఒత్తిడి ఇట్టే దూరమవుతుంది. మైండ్ కు రిలీఫ్ లభిస్తుంది.
Also Read: Stomach Pain: వీటితో కేవలం 10 నిమిషాల్లో పొట్ట నొప్పికి చెక్, ఈ టిప్ తెలిస్తే మందుల జోలికి పోరు!
** కప్పు పెరుగులో కొంచెం వాము వేసుకుని తింటే పంటి సమస్యలతోపాటు నోటి పూత సమస్యల నుంచి బయటపడవచ్చు.
** పెరుగులో కొంచెం చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. దీంతో మీరు మూత్రాశాయ సమస్యల నుంచి బయటపడతారు.
** పెరుగులో వాతం, కఫాలను తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి.
** ఛాతీ మంట నుంచి ఉపశమనం కలిగించడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది.
** పెరుగులో తేనె కలిపి తాగితే అల్సర్ తగ్గుతుంది.
Also Read: Low Blood Pressure: ఈ ప్రాణాయామంతో కేవలం 10 రోజుల్లో లో బీపీ మాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి