Reduce Gastric Problem: పొట్టలోని గ్యాస్ సమస్య కారణంగా పనులు చేయలేకపోతున్నారా? ఈ చిట్కాలతో కేవలం 10 నిమిషాల్లోనే చెక్ పెట్టొచ్చు

How To Reduce Gastric Problem: తరచుగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించడం వల్ల తొందర్లోనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 7, 2023, 04:09 PM IST
Reduce Gastric Problem: పొట్టలోని గ్యాస్ సమస్య కారణంగా పనులు చేయలేకపోతున్నారా? ఈ చిట్కాలతో కేవలం 10 నిమిషాల్లోనే చెక్ పెట్టొచ్చు

Gas Problem Home Remedy: అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తిన్నప్పుడు చాలామందిలో పొట్టలో ఇబ్బందులు వస్తుంటాయి. ముఖ్యంగా పొట్ట లోపల నుంచి ఆహారం గొంతులోకి వస్తూ ఉంటుంది. మరికొంతమందిలో గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిది లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలను అతిగా వినియోగిస్తున్నారు. వినియోగించడం వల్ల కొంతకాలం వరకే ఉపశమనం లభించి మళ్లీ ఇలాంటి సమస్యలే వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

పొట్టలోని గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించే చిట్కాలు ఇవే:
నిమ్మరసం:

తరచుగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు నిమ్మరసాన్ని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. 

జీలకర్ర నీరు:
జీలకర్ర యాసిడ్ న్యూట్రలైజర్‌గా కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపణులు చెబుతున్నారు. ప్రతిరోజు గ్యాస్ ట్రబుల్ సమస్యలతో బాధపడుతున్న వారు రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటిలో వేసి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  

లవంగాలు:
పొట్టలో ని గ్యాస్ ను తగ్గించేందుకు లవంగాలు కీలక పాత్ర పోషిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో లవంగాల పొడిని కలుపుకొని తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.

ఆకుకూర:
జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు సెలెరీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తరచుగా దీనితో తయారుచేసిన ఆహారాలు తినడం వల్ల పొట్టలోని గ్యాస్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News