Blue Light Effect: ఆధునిక జీవనశైలి కారణంగా పిన వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. మీరు కూడా 40లో అరవైలా కన్పిస్తుంటే..ఏం చేయాలో తెలుసుకుందాం..
వృద్ధాప్య ఛాయలు ముఖంపై కన్పించడం అనేది ఇటీవలి కాలంలో సర్వ సాధారణమైపోయింది. గతంలో జరిగిన చాలా అధ్యయనాల్లో దీనికి చాలా కారణాల్ని తేల్చారు. మొబైల్, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్స్ ప్రభావం కంటి వెలుగుపై పడుతుంది. మానసిక ఆరోగ్యంపై చూపిస్తుంది. అదే సమయంలో ఏజీయింగ్ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. ఫ్రంటియర్ ఇన్ ఏజీయింగ్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక యానిమల్ మోడల్ అధ్యయనం ప్రకారం..స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్స్ నుంచి వెలువడే బ్లూ లైట్ కారణంగా తక్కువ వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తున్నాయి.
టీవీ, ల్యాప్‌టాప్, ఫోన్ వంటి రోజూ ఉపయోగించే ఉపకరణాల్నించి వెలువడే బ్లూ లైట్‌కు ఎక్కువగా ప్రభావితమైతే..శరీరంలోని చర్మం, ఇతర సున్నితమైన భాగాలపై హానికారక ప్రభావం పడుతుంది. బ్లూ లైట్ కారణంగా ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.
బ్లూ లైట్ అంటే ఏమిటి
బ్లూ లైట్‌ను హై ఎనర్జీ విజిబుల్ అని కూడా పిలుస్తారు. ఇది ఓ రకమైన కాంతి. మనిషి కళ్ల నుంచి లైట్ స్పెక్ట్రమ్‌తో చూడవచ్చు. అందుకే మనిషి కంటితో ఆకాశం నీలంగా కనబబడుతుంది. ఎందుకంటే బ్లూ లైట్ వేవ్స్ మన వాతావరణంలో అల్లుకుని ఉంటాయి. దీర్ఘకాలంలో బ్లూ లైట్ ఎంతవరకూ హాని చేస్తుందనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్లూ లైట్ కారణంగా ఏజియింగ్ ప్రక్రియపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
Also read: Muslim Boy Names: అందమైన టాప్ 50 యూనిక్ ముస్లిం బాయ్స్ పేర్లు మీ కోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook