Jonna Pindi Samosa Recipe In Telugu: సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా ఏదో ఒకటి తినండి మనసున అస్సలు పట్టదు.. అందుకే చాలామంది ఉల్లి పకోడా, సమోసా లాంటివి ఇంట్లోనే వేడివేడిగా తయారు చేసుకొని తింటారు. కొంతమంది అయితే మిరపకాయ బజ్జీలు, వేయించిన పల్లీలు కూడా తీసుకుంటూ ఉంటారు.. అధ్యయనాల ప్రకారం భారతీయులు ఎక్కువగా సాయంత్రం చిరుదిండ్లలో భాగంగా సమోసానే ఎక్కువగా తీసుకుంటున్నారని తేలింది. అయితే ప్రతిరోజు సమోసాలు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. ఎందుకంటే సమోసాను తయారు చేసుకునే పిండిలో ఎక్కువగా మైదా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మైదాతో తయారుచేసిన సమోసాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు.
ఆరోగ్యంగా సమోసాలు తినాలనుకునేవారు మైదా పిండికి బదులుగా జొన్న పిండితో తయారుచేసిన వాటిని కూడా తీసుకోవచ్చు. జొన్న పిండితో తయారుచేసిన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని మధుమేహం, బరువు తగ్గాలనుకునే వారు కూడా తీసుకోవచ్చు. కాబట్టి తరచుగా మైదాపిండి సమోసాకు బదులుగా జొన్నపిండితో తయారు చేసిన సమోసాను తీసుకోవడం ఎంతో మంచిది. అయితే ఈ సమోసాలు తయారు చేయడం కూడా చాలా సులభం దీని తయారీ పద్ధతి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..
జొన్న సమొసాకు కావలసిన పదార్థాలు:
ఒక కప్పు జొన్నపిండి
ఒక కప్పు గోధుమపిండి
ఒక కప్పు ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప
సమోసా వేయించడానికి నూనె
ఉడికించిన బటానీలు
పచ్చిమిర్చి
తగినన్ని ఉల్లిపాయలు
పోపు దినుసులు
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
తయారీ విధానం:
ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని తగినంత నీరు పోసి బాగుగా పిండి ముద్దగా చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టుకొని ఆలును కర్రీ స్టఫింగ్‌లా తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత నూనె వేసుకుని పోపు దినుసులు ఉల్లి బటానీలు బంగాళదుంప వేసుకొని కర్రీలా తయారు చేసుకోవాలి.
ఆ తర్వాత పక్కన పెట్టిన పిండి ముద్దలను చిన్న ముద్దలుగా చేసి పూరి సైజ్లో రుద్దుకొని, దీని మీద బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి త్రిభుజాకారంలో చేసి నూనెలో వేయించు కోవాలి. అంతే సులభమైన పద్ధతిలో ఎంతో హెల్తీ అయిన జొన్న సమోసాలు రెడీ అయినట్టే..
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter