Skin Care Tips: జాజికాయతో ఈ ఒక్కటి కలిపి ముఖానికి రాసుకుంటే రాత్రికిరాత్రే మచ్చలు మాయం..

Nutmeg Skin Care Tips: జాజికాయను ఔషధంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది మన అమ్మమ్మల కాలంనాటి నుంచి ఉపయోగిస్తారు. సాధారణంగా జాజికాయను ఆహారంలో మసాలాగా ఉపయోగిస్తారు. అయితే, చర్మానికి కూడా జాజికాయను ఉపయోగిస్తారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 22, 2024, 03:19 PM IST
Skin Care Tips: జాజికాయతో ఈ ఒక్కటి కలిపి ముఖానికి రాసుకుంటే రాత్రికిరాత్రే మచ్చలు మాయం..

Nurmeg Skin Care Tips:  జాజికాయను ఔషధంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది మన అమ్మమ్మల కాలంనాటి నుంచి ఉపయోగిస్తారు. సాధారణంగా జాజికాయను ఆహారంలో మసాలాగా ఉపయోగిస్తారు. అయితే, చర్మానికి కూడా జాజికాయను ఉపయోగిస్తారు. ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా జాజికాయను ముఖంపై మచ్చలను దూరంగా ఉంచుతుంది.

జాజికాయను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ఉన్న వాపు, చికాకును తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు జాజికాయను ముఖంపై అప్లై చేసుకోవాలి. నేరుగా కాకున్నా కొన్ని ఇతర సౌందర్య ఉత్పత్తులతో కూడా జాజికాయను ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు త్వరగా పోతాయి.

ఇదీ చదవండి: Match Box in Rice: బియ్యం డబ్బాలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా?

జాజికాయను కలబందతో కలిపి రాసుకుంటే మచ్చలు త్వరగా పోయి ముఖంపై మెరుపు కూడా వస్తుంది. ఈ రెండూ చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. వీటిని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. చర్మకాంతి పెరుగుతుంది.  ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి తేమ కూడా నిలుస్తుంది. 

ఇదీ చదవండి: Oral Care: మీ పళ్లను ఇలా కేవలం 2 నిమిషాల్లో ముత్యాల్లా మెరిపించేయండి..

 జాజికాయను మెత్తగా నూరి, పాలలో కలిపి ముఖానికి రాసుకోవాలి. మీ ముఖంపై ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత చేతులతో సున్నితంగా మసాజ్ చేయండి. ఆరిన తర్వాత సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలి. పాలు ముఖంపై అలెర్జీ ఉండి పడనివారు దీనికి బదులు రోజ్ వాటర్‌ను కూడా జాజికాయతో కలిపి అప్లై చేసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News