Idli Nutrition Facts: మనలో చాలా మంది ప్రతి రోజు ఇడ్లీ అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం మంచిదేనా? రోజు ఇడ్లీ తింటే ఏం జరుగుతుంది? ప్రతి రోజు ఇడ్లీలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు అల్పాహారంగా ఇడ్లీలు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్‌తో పాటు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
బరువును నియంత్రిస్తుంది:
ఇడ్లీల్లో తక్కువ కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా పోషకాలు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయాన్నే ఇడ్లీలు తినడం వల్ల శరీరానికి తగిన ఫైబర్, ప్రోటీన్‌లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఆకలిని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
ఇడ్లీ పిండిని పులియబెట్టి ఇడ్లీలను తయారు చేసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తహీనతను తగ్గిస్తుంది:
ఇడ్లీల్లో ఐరన్ ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు ఇడ్లీలు తినడం వల్ల రక్తహీన నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శక్తిని పెంచుతుంది:
ఇడ్లీల్లో శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్ మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి అద్భుతమైన శక్తిని అందిస్తుంది. దీంతో పాటు కండరాల శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె సమస్యలకు:
ఇడ్లీలు రోజు తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. దీని కారణంగా గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.