కరోనా సంక్షోభ కాలం ( Corona pandemic ) లో యోగా ప్రాముఖ్యతను ( Importance of yoga ) ప్రపంచదేశాలు ఇప్పుడు ఎక్కువగా గుర్తిస్తున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా ప్రాముఖ్యత ఏంటి...కరోనాకు యోగాకు ఉన్న లింక్ ఏంటి...యోగా వల్ల కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకోవల్సిన అవసరం ఉంది. యోగా ఏ విధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుందో తెలుసా.
యోగా ( Yoga ) అనేది ఇవాళో నిన్ననో హఠాత్తుగా తెరపై వచ్చింది కానేకాదు. యోగాకు ( History of Yoga ) 2 వేల నుంచి 4 వేల సంవత్సరాల చరిత్ర ఉందని వివిధ రకాల పురాణాల ద్వారా తెలుస్తోంది. యోగా అంటే వాస్తవానికి సంస్కృత భాషలో ఐక్యమని అర్ధం. యోగా శాస్త్ర ప్రకారం ఐక్యమంటే….మనస్సుతో శరీరాన్ని మిళితం చేయడం ద్వారా ఆత్మకు చేరువవడం అని అర్ధం.
యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ( Benefits of Yoga ) , ప్రాముఖ్యత గురించి దేశంలో అనాది నుంచి కాలానుగుణంగా నాటి జ్ఞానులు చేసిన ప్రచారం గానీ...ఆవిష్కరించిన సాధనల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది పతంజలి ( Patanjali ) ద్వారానే.
మనిషి జీవనశైలిని సులభతరం చేసేందుకు యోగా నిస్సందేహంగా ఓ అద్భుత మార్గం. మనిషి శరీరం చేయగలిగిన అత్యుత్యమ వ్యాయామ పద్ధతుల్లో యోగా కీలకం. యోగా కేవలం శారీరకంగానే కాదు మానిసికంగా కూడా మనిషిని ధృడం చేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా అద్బుతమైన ప్రయోజనాలున్నాయి. Also read: World Chocolate Day: డార్క్ చాక్లెట్ వల్ల ఎన్ని లాభాలో
రోగ నిరోధక శక్తి ( Immunity power )
యోగాతో మనిషి శరీరంలోని యోగ నిరోధక శక్తి కచ్చితంగా పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. యోగాలోని కొన్ని కీలక ఆసనాలు ముఖ్యంగా ప్రాణాయామం ద్వారా ఈ శక్తిని పెంపొందించుకోవచ్చు. దీంతో పాటు అనులోమ విలోమ ఆసనాలు, తడసన , త్రికోణాసనాలు వేయడం ద్వారా మనిషిలోని శోషరస ద్రవాలు పెరుగుతాయని. వీటిలో రోగ నిరోధక కణాలు అధిక సంఖ్యలో ఉంటాయి. తద్వారా బయట్నింటి మన శరీరంలో ప్రవేశించే వ్యాధులతో...ఇన్ఫెక్షన్లతో రోగ నిరోధక శక్తి పోరాడుతుంది. దరిచేరకుండా కాపాడి ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది.
కోవిడ్ 19 వైరస్ ( COVID 19 VIRUS ) మహమ్మారిగా మారిన నేపధ్యంలో యోగాకు అందుకే ప్రాధాన్యత ఏర్పడింది. కోవిడ్ 19 వైరస్ ప్రధానంగా మనిషి రోగ నిరోధక శక్తిపై ( IMMUNITY SYSTEM ) దాడి చేస్తుంది. రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నంతసేపూ...వైరస్ ప్రభావాన్ని చూపలేదు. ఎప్పుడైతే ఆ శక్తి తగ్గిపోతుందో...వైరస్ బలపడటం ప్రారంభిస్తుంది. యోగా ద్వారా ముఖ్యంగా ప్రాణాయామం ( Pranayam) తో ఆ శక్తిని పెంపొందించుకోవచ్చు. ఈ వాస్తవాన్ని ప్రపంచం మొత్తం గుర్తించబట్టే .ఇప్పుడీ సమయంలో యోగాకు ప్రాధాన్యత ఏర్పడింది.
యోగాతో ఇతర ప్రయోజనాలు ( Other Benefits of Yoga ):
శరీర రుగ్మతల్ని దూరం చేసుకోడానికి వివిధ రకాల మందుల వాడకం కంటే...యోగాసనాల్ని ఆచరించడం ద్వారా వాటిని దూరం చేసుకోవచ్చని చాలా రకాల పరిశోధనల్లో నిరూపితమైంది. ముఖ్యంగా అధిక రక్త పీడనం ( Blood pressure BP ) , మధుమేహం ( Diabetes ) , గుండె సంబంధిత వ్యాధులు ( Cardioc problems ) వంటి వాటిని దూరం చేయడంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. క్రమం తప్పకుండా రోజూ యోగాభ్యాసం చేయడం ద్వారా మనిషి శరీరంలోని రక్తనాళాలు సిరలకు విశ్రాంతి కలగడమే కాకుండా...వాటికి బలం చేకూరుతుంది. తద్వారా రక్తపీడనం తగ్గుతుంది. ఇన్సులిన్ ఉత్పత్రిలో సమతుల్యత లోపించకుండా ఉంటుంది. తద్వారా గ్లూకోస్ స్థాయి స్థిరంగా ఉంటుంది. ప్రాణాయామం, వీరభద్రాసనం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.
యోగాతో మనిషి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వయస్సుతో పాటు కలిగే మార్పులు, శారీరకంగా ఎదురయ్యే నొప్పుల్నించి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా నిద్రలేమి ( Insomnia ) కీళ్లనొప్పులు , ఆస్తమా వంటి వ్యాధులు దూరమవుతాయి. యోగా ( Yoga ) ద్వారా మనిషి శరీరంలోని ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. కాల్షియం స్థాయి బ్యాలెన్స్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఎముకల బరువు పెరుగుతుంది. యోధాసనం, ప్రక్క కోన ఆసనాల ద్వారా ఎముకలు శక్తివంతమవుతాయి. వారానికి రెండుసార్లు శవాసనం వేయడం ద్వారా నిద్రలేమి సమస్య పోతుంది. Also read: Covid19 Virus: కరోనా వైరస్ ఇంట్లోకి చొరబడకుండా ఇలా చేయండి
ఆకలి-అధికాకలి సమస్య ( Apatite Problem ):
నిత్యం యోగా చేయడం ( Daily Yoga ) ద్వారా మనిషి శారీరక, మానిసిక బంధం ధృడంగా ఉంటుంది. దాంతో ఆకలి సమస్య గానీ..అధిక ఆకలి సమస్య గానీ దూరమవుతుంది. శరీరానికి ఎంత అవసరమో అంతే తినగలిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తినడం కానీ...పూర్తిగా తినకపోవడం గానీ సహజంగా ఎదురయ్యే ప్రధాన సమస్య. యోగాతో ఎప్పుడైతే ఒత్తిడి దూరమవుతుందో ఈ సమస్య కూడా తీరిపోతుంది.
మెరుగైన జీవ ప్రక్రియ ( Digestive system ):
మనం రోజూ తీసుకునే ఆహారంలోని పోషక పదార్ధాల్ని శరీరం సక్రమంగా గ్రహించాలంటే ఆహారం సరైన పద్ధతిలో జీర్ణమవడం చాలా అవసరం. లేకపోతే జీర్ణసంబంధిత సమస్యలు ఎదురవుతాయి. జీర్ణక్రియకు అవసరమైన ద్రవాల ఉత్పత్రి క్రమంగా ఉంటే ఈ సమస్య తలెత్తదు. దీనికోసం ముఖ్యంగా యోగాలో మెలితిప్పి కూర్చునే ఆసనం ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
గుండెకు భద్రత ( Safety of Heart ):
మనిషి హృదయం ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. శరీరంలోని కండరాళ్లనే కాకుండా గుండె సంబంధిత కండరాల్ని కూడా శక్తివంతం చేయడంలో యోగా కీలకంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పాదాంగుష్ఠాసన లేదా జానూ శిరాసన ద్వారా గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు.
రక్తంలో కొవ్వు ( Cholesterol in Blood ):
మనిషి శరీరంలో చాలా సమస్యలకు కారణం రక్తంలో కొవ్వు పేరుకుపోవడం. ముఖ్యంగా రక్తంలో ఉన్న కొవ్వుని గ్లిజరాయిడ్స్ ఎక్కువైతే రక్తం కలుషితమవుతుంది. దాంతో రక్తనాళాలు గట్టిపడే ప్రమాదం ఉంటుంది. ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. యోగా ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడి...మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడు. సర్వాంగాసన ద్వారా కొవ్వు శాతం బాగా తగ్గించవచ్చు. Also read: Kalonji Oil: ఆ ఆయిల్ తో అన్ని సమస్యలకు చెక్