Cockroaches: ఎలాంటి ఖర్చులు లేకుండా.. ఇలా సులభంగా మీ ఇంట్లో ఉండే బొద్దింకలకు 1 రోజులో చెక్ పెట్టండి..

How To Get Rid Of Cockroaches: చాలామంది ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ బొద్దింకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అయితే ఇవి ఆహార పదార్థాలపై కూడా అప్పుడప్పుడు వాలుతూ ఉంటాయి. బొద్దింకలు వాలిన ఆహారాలను తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలు వినియోగించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2023, 08:53 PM IST
Cockroaches: ఎలాంటి ఖర్చులు లేకుండా.. ఇలా సులభంగా మీ ఇంట్లో ఉండే బొద్దింకలకు 1 రోజులో చెక్ పెట్టండి..

 

How To Get Rid Of Cockroaches: ఎక్కువగా ఇంట్లో మనకు కనిపించే కీటకాల్లో ఒకటి బొద్దింకలు. ఉదయం కంటే ఎక్కువగా రాత్రుల్లో ఒక చోటు నుంచి మరొక చోటికి సంచారం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలామంది వీటిని చూసి చిరాకు పడడం, భయపడడం చేస్తూ ఉంటారు. చాలామంది బొద్దింకను చూసిన వెంబటే చంపేయడం లేదా వాటిని పట్టుకొని బయటపడేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీటివల్ల ఎన్నో రకాల బ్యాక్టీరియా మనం నివసించే చోట సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్ లతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి బొద్దింకల నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది మార్కెట్లో లభించే స్ప్రేలు వినియోగిస్తున్నారు. 

మార్కెట్లో లభించే బొద్దింకల స్ప్రే ను ప్రతిరోజు ఇంట్లో వినియోగించడం ద్వారా అందులో ఉండే రసాయనాలు మనుషులకు అనేక రకాలుగా చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కారణంగా ఊపిరితిత్తుల సమస్యలతో పాటు చిన్నపిల్లలలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీటికి బదులుగా కొన్ని ఇంటి చిట్కాలను పాటించి బొద్దింకలను సులభంగా పారద్రోచ్చు. ఈ సాధారణ చిట్కాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలు పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

బొద్దింకలు ఉన్నచోట ప్రస్తుతం చాలామంది స్ప్రే లేదా కొన్ని రకాల రసాయనాలతో కూడిన పదార్థాలను పెడుతూ ఉంటారు. వీటివల్ల బొద్దింకలు మరణించడమే కాకుండా మనుషులకు కూడా అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా బిర్యాని ఆకును అవి ఉన్నచోట ఉంచితే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఆ బిర్యానీ ఆకుల నుంచి వచ్చే స్మెల్ కారణంగా బొద్దింకలు మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి.

బొద్దింకల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కీరదోసకాయ కూడా ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. బొద్దింకలు సంచారం చేసే చోట కీరదోసకాయలను ముక్కలుగా కట్ చేసి ఉంచడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అప్పుడే జన్మించిన బొద్దింక పిల్లలు కూడా మరణించే అవకాశాలున్నాయి. దీంతోపాటు లావెండర్ ఆయిల్ ను వినియోగించడం వల్ల కూడా సులభంగా బొద్దింకలను పారద్రోలవచ్చు. ఘాటైన దాల్చిన చెక్క పొడి తో బొద్దింకల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News