Find Sweet Mangoes: మామిడిపండు తీయ్యగా ఉన్నది ఇలా గుర్తించి కొనుగోలు చేయండి..

Find Sweet Mangoes: ఎండకాలం వచ్చేసింది మార్కెట్లో మామిడిపండ్లు కనిపిస్తున్నాయి. మామిడిపండు అంటే ఇష్టం లేని వారు ఉండరు. మన దేశంలో రకరకాల మామిడిపండ్లు అందుబాటులో ఉన్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 16, 2024, 05:06 PM IST
Find Sweet Mangoes: మామిడిపండు తీయ్యగా ఉన్నది ఇలా గుర్తించి కొనుగోలు చేయండి..

Find Sweet Mangoes: ఎండకాలం వచ్చేసింది మార్కెట్లో మామిడిపండ్లు కనిపిస్తున్నాయి. మామిడిపండు అంటే ఇష్టం లేని వారు ఉండరు. మన దేశంలో రకరకాల మామిడిపండ్లు అందుబాటులో ఉన్నాయి. ఏవి తీయ్యగా ఉంటాయో బయటవైపు నుంచి చూసి గుర్తించడం కొందరికి కష్టతరం అవుతుంది.  అయితే, మామిడిపండ్లు తీయ్యగా ఉన్నాయా? పుల్లగా ఉన్నాయా?అని బయటవైపు నుంచి చూసి గుర్తించడం ఎలానో తెలుసుకుందాం.

మామిడిపండు బరువును తనిఖీ చేసి కూడా చెప్పొచ్చు. బరువు తక్కువగా ఉంటే కూడా అది త్వరగా పాడవుతుంది అని అర్థం. అలాంటి మామిడి పండ్లు కొనుగోలు చేయకూడదు. ఇవి వేరే మామిడి పండ్లను కూడా పాడు చేస్తాయి.

మామిడిపండు తీయ్యగా ఉన్నది మనం దాన్ని చూడగానే గుర్తించవచ్చు. అంటే మామిడిపండ్లను తాకి గుర్తించవచ్చు. మామిడి పండు తాకగానే మెత్తగా ఉంటే అది తీయ్యగా ఉండే పండని అర్థం. మామిడిపండ్లు గట్టిగా ఉంటే అవి తీయ్యగా లేకుండా ఉండొచ్చని అర్థం.

ఇదీ చదవండి: వెల్లుల్లితో వారంలో 3 కిలోలు ఈజీగా తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా?

మామిడి పండు ఆకారం తనిఖీ చేసి కూడా పండినదా? లేదా? అని కూడా గుర్తించవచ్చు. మామిడి ఆకారం గుండ్రంగా ఉంటే కూడా అది పండినది అని అర్థం. అది చూడటానికి బొద్దుగా కనిపించినా ఆ మామిడి పండు బాగా పండినది అయి ఉండొచ్చు.

పండిన మామిడికాయ తింటే రుచి బాగుంటుంది. ఒక్కోసారి పెద్దగా ఉండే మామిడిపంట్లు కూడా తీయ్యగా ఉంటాయి. వాటిని క్షుణ్నంగా తనిఖీ చేసి కొనుగోలు చేయండి. కొన్ని సార్లు వాసన ద్వారా గుర్తించవచ్చు. మామిడి పండు గుర్తించడానికి దానిపై భాగం ఓసారి తనిఖీ చేయండి. మామిడిపండు పైభాగంలో వాసన చూస్తే తీయగా వస్తుంది. ఒకవేళ పండిన మామిడి పండు కాకుండా రసాయనాలు చల్లిందయితే తీయ్యని వాసన రాదు. ఈ పండు తీయ్యగా లేదని అర్థం కావచ్చు.

ఇదీ చదవండి: స్నానం చేసే నీటిలో పసుపు వేసుకుంటే 5 ఆరోగ్య ప్రయోజనాలు..

మామిడి పండు చెట్టు నుంచి కట్‌ చేయకముందు కూగా అది తీయ్యగా ఉంటుందో లేదో గుర్తించవచ్చు. మామిడిపండు ఉన్న కొమ్మకు ఆకులు ఎక్కువగా లేనివి కట్ చేయండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News