Home Remedies For Constipation: చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. జీర్ణవ్యవస్థ అనారోగ్యంగా మార్చే చాలా రకాల ఆహారాలను విచ్చల విడిగా తింటున్నారు. దీంతో బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యల బారిపడుతున్నారు. అయితే చాలా మంది మలవిసర్జన చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ మలబద్ధకం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి.. ఈ రోజు కొన్ని చిట్కాలను మీకు తెలియజేయబోతున్నాం. వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే సులభంగా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి:
మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకునే ఆహరంలో పోషకాలున్న ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం కావడమేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మలబద్ధకం సమస్య సులభంగా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, పిండి పదార్థాలు, గింజలు, నారింజ, మొసాంబి, బొప్పాయిలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
వేడిగా ఏదైనా త్రాగండి:
వివిధ రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల పొట్టలోని పేగుల్లో పేరుకుపోతోంది. ఉదయం నిద్రలేచి వేడిగా ఉండే నీటిని గాని ఇతర సూప్‌లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల మల విసర్జనలో మార్పులు కూడా వస్తాయి. కాబట్టి సులభంగా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం చాలా మంది వెస్ట్రన్ టాయిలెట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే మలబద్ధకం సమస్యలు ఉన్నవారు వాటిని వినియోగించకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కావాలనుకుంటే ఇండియన్ టాయిలెట్ ఉపయోగించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే
Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook