Weight Loss Tips: కొవ్వు, స్థూలకాయం..ప్రస్తుతం ప్రధాన సమస్యలు ఈ రెండే. అందరికీ ఇదే ఇబ్బంది. మీకు కూడా హెల్తీగా, ఫిట్‌గా ఉండాలనుందా..అయితే ఇవాళే మీ డైట్‌లో పెరుగు చేర్చుకోండి.
ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లతో స్థూలకాయం పెను సవాలుగా మారింది. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్ చేయడం, వర్కవుట్లు చేయడం ఇలా ఎవరికి నచ్చింది వాళ్లు చేస్తుంటారు. బరువు తగ్గడమనేది ఆరోగ్యంగా సాగాలి తప్ప..అసహజంగా ఉండకూడదు. పూర్తి ఆరోగ్యంగా బరువు తగ్గించుకోవాలంటే..పెరుగు అద్భుత ఔషధమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇవాళే మీ డైట్‌లో చేర్చుకుంటే కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలుంటాయి. పెరుగుతో బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
పెరుగు శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబోలిజంను వృద్ధి చేస్తుంది. మెటబోలిజం ఎప్పుడైతే మెరుగ్గా ఉంటుందో..సహజంగానే బరువు తగ్గుతారు. పెరుగులో ఉండే ప్రోటీన్ల కారణంగా కడుపు నిండినట్టుగా ఉండి..ఆకలేయదు.
బరువు తగ్గేందుకు పెరుగును సాధారణంగా ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు.పెరుగు నేరుగా తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలుంటాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మద్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌లో తప్పకుండా తీసుకోవాలి. ఫలితంగా ఓవర్ ఈటింగ్ తగ్గి..నెమ్మదిగా బరువు తగ్గుతారు. పెరుగుతో పాటు డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసి కలుపుకుని తాగితే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి.శరీరానికి కావల్సిన పౌష్ఠిక పదార్ధాలు లభిస్తాయి. పెరుగు నేరుగా తినడం ఇష్టం లేకపోతే..కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ చల్లుకుని తాగవచ్చు. ఈ రెండింటి మిశ్రమం ఆరోగ్యానికి చాలా మంచిది.
Also read: Black Coffee Benefits: బెడ్ కాఫీ వద్దు..బ్లాక్ కాఫీ ముద్దు, బ్లాక్ కాఫీతో వృద్ధాప్య ఛాయలు మటుమాయం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook