Healthy Weight Reduction: సహజంగా, ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు ఏం చేయాలి

Healthy Weight Reduction: ఇటీవలి కాలంలో దాదాపు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య స్థూలకాయం. ఇది తగ్గించేందుకు ఎలాంటి పద్ధతుల్ని అనుసరించాలనేది అతి ముఖ్యమైన సవాలు. లేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2022, 01:27 AM IST
Healthy Weight Reduction: సహజంగా, ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు ఏం చేయాలి

ప్రస్తుత బిజీ ప్రపంచంలో వివిధ కారణాలతో స్థూలకాయం లేదా బెల్లీ ఫ్యాట్ పెను సమస్యగా మారుతోంది. స్థూలకాయం తగ్గించేందుకు చాలా మార్గాలున్నా..బరువు ఎప్పుడూ ఆరోగ్యకరంగానే తగ్గాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే మనిషి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.

ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లతో స్థూలకాయం లేదా మరికొందరిలో బెల్లీ ఫ్యాట్ అతిపెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. డైటింగ్ చేయడం, వర్కవుట్లు చేయడం ఇలా ఎవరికి నచ్చింది వాళ్లు చేస్తుంటారు. ఒకవేళ కొన్ని పద్ధతుల్లో బరువును తగ్గించుకోగలిగినా..అది ఆరోగ్యకరంగా సాగకపోతే..అనారోగ్యం వెంటాడుతుంటుంది. 

అందుకే బరువు తగ్గడమనే ప్రక్రియ ఎప్పుడూ ఆరోగ్యకరంగా సాగాలి తప్ప..అసహజంగా ఉండకూడదు. అంటే బరువు తగ్గించుకోవడమనేది సహజ సిద్ధంగా జరగాలి. కృత్రిమ పద్ధతుల్లో జరిగితే అనారోగ్యం వెంటాడుతుంది. ఉదాహరణకు సర్జరీలు, విపరీతమైన వర్కవుట్లు, డైట్ పూర్తిగా తగ్గించేయడం వంటివి పూర్తిగా అనారోగ్యకరమైన పద్ధతులు. 

ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోవాలంటే..పెరుగు అద్భుత ఔషధమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇవాళే మీ డైట్‌లో చేర్చుకుంటే కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలుంటాయి. పెరుగుతో బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..

పెరుగు సహజసిద్ధంగా బరువు తగ్గించే అద్భుతమైన ఔషధం. ఇది ఒక ప్రో బయోటిక్ ఫుడ్. శరీరంలోని కొవ్వును కరిగించడంలో దోహదపడుతుంది. పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి..మెటబోలిజంను వృద్ధి జరుగుతుంది. మెటబోలిజం ఎప్పుడైతే మెరుగ్గా ఉంటుందో..సహజంగానే బరువు తగ్గుతారు. పెరుగులో ఉండే ప్రోటీన్ల కారణంగా కడుపు నిండినట్టుగా ఉండి..ఆకలేయదు. పెరుగు నేరుగా తినడం ఇష్టం లేకపోతే..కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ చల్లుకుని తాగవచ్చు. 

బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం పెరుగును ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మద్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌లో తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తిండిపై కోరిక తగ్గి..నెమ్మదిగా బరువు నియంత్రణలో ఉంటుంది. రుచి కోసం, పోషకాల కోసం పెరుగుతో పాటు డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకుని తాగితే ఇంకా మంచిది.

అంతేకాదు..శరీరంలో వివిధ కారణాల వల్ల వేడెక్కితే అంటే వేడి చేస్తే...పెరుగు నియంత్రిస్తుంది. పెరుగు, మజ్జిక అనేవి చలవ చేసే పదార్ధాలు. ఆరోగ్యానికి చాలా మంచిది.  

Also read: Orange precautions: మీకు ఆ సమస్యలుంటే..ఆరెంజ్ తినకూడదు, తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News