Health Benefits of Triphala Churna: త్రిఫల అనేది ఒక ఆయుర్వేదానికి సంబందించిన ఒక మొక్క లేక మూలిక. ఇది కేవలం భారతదేశంలో ఉద్భవించిన మూలిక. త్రిఫల వలన పూర్తిగా శరీరం లోపల శుద్ధి చేయబడుతుంది. ప్రేగు యొక్క కదలికలకి కూడా ఇది సహాయపడుతుంది. అక్షరాల త్రిఫల అంటే 'మూడు పండ్లు' అని అర్థం - హరితాకి (Gallnut), అమలాకి (Gooseberry) మరియు బిభితాకి (Bibithaki). త్రిఫల చూర్ణం అంటే, ఆ మూలిక యొక్క పొడి రూపం.
త్రిఫల చూర్ణం వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. త్రిఫల చూర్ణంలో ఉండే మూడు ఫలాలకి ఏ ఆరోగ్య సమస్యనైన నయం చేసే శక్తి ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి ఆయుర్వేద శాస్త్రంలో త్రిఫల చూర్ణం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది విరేచనాలకి మందుగా ఉపయోగపడటమే కాకుండా, హృదయ సంబందిత వ్యాధులైన అధిక రక్త పోటు మరియు అల్సరేటివ్ కోలైటిస్ వంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఇది ప్రతిరోజూ వాడటం వలన కాలేయ సంబందిత సమస్యలు కూడా దగ్గరకి రావు. అలాగే రక్తాన్ని శుద్ధి చేసి శరీర ఆరోగ్యానికి సహాయపడుతుంది.
Also Read: India Covid Updates: కొత్తగా 15,786 వేలకేసులు.. 231 మరణాలు.. 98.16% రికవరీ రేటు!
ఫలితాల కోసం త్రిఫల చూర్ణంని మంచి నీటితో తీసుకోవాలి. 500 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీటిలో 2 నుంచి 3 గ్రాముల త్రిఫల చూర్ణంని కరిగించి ఒక రాత్రంతా ఉంచి త్రాగాలి. ఒకేసారి మొత్తం త్రాగలేనివారు, ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న మోతాదుల్లో తీసుకోవాలి. భోజనంకి ముందు 30 నుంచి 60 నిమిషాల ముందే త్రాగాలి.
త్రిఫలాని త్రిదోశిక్రాసయన అని కూడా అంటారు, ఎందుకంటే ఇది శరీరంలోని వాత, పిత్త మరియు కఫ అనే మూడు దోషాలను సమతుల్యత పరుస్తుంది . పూర్వకాల భారతీయ గ్రంధాలైన చరక మరియు శుశ్రుత సంహితలలో త్రిఫల చుర్ణంని సూచించబడి ఉంది.
త్రిఫల చూర్ణం యొక్క మరి కొన్ని ఆరోగ్యానికి సంబందించిన ప్రయోజనాలు:
1) ఇది కళ్ళకి, చర్మానికి మరియు గుండెకి చాలా మేలు చేస్తుంది. శరీరం యొక్క శక్తి ఛానల్స్ శుద్ధి చేయబడి, మనసుకి ప్రశాంతతని కలిగిస్తాయి. ఇది ఉపయోగించడం వలన జుట్టు సన్నబడటం తగ్గిపోతుంది, మరియు జుట్టుకి కొంత నల్లదనాన్ని మరియు బలాన్ని సమకూరుస్తుంది.
Also Read: Paritala Sunitha: మాది సీమ రక్తమే..రక్తం ఉడుకుతోంది: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
2) ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, త్రిఫల చూర్ణం జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది మరియు వయసుని పసిగట్టకుండా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెంచుతుంది. కడుపులో ఆమ్లత్వం వలన కలిగే ఇబ్బంది నుంచి విముక్తి కలిగించి, ఆకలిని పెంచుతుంది.
3) త్రిఫల చూర్ణం మూత్ర విసర్జనకి సహాయ పడుతుంది, మరియు మూత్ర నాళాలలో సమతుల్యతని కాపాడుతుంది. కాలేయం యొక్క ఆరోగ్యం కాపాడి, దాని యొక్క పనితనం పెంపొందిస్తుంది. కావున శరీరం విషపూరితమైన పదార్థాల నుంచి విముక్తి చేయబడుతుంది. ఊపిరితిత్తులలో తేమ మరియు శ్లేష్మం యొక్క సమతుల్యతని కాపాడి, శ్వాసకోశ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
4) అంతే కాకుండా, త్రిఫల చూర్ణం కండరాల స్థాయిని కాపాడటమే కాకుండా, సన్నమైన కండరాల యొక్క బరువుని పెంచి దృడంగా ఉంచుతుంది. ముఖ్యంగా యోగా చేసేవారిలో మంచి ఫలితాలు కనపడతాయి.
Also Read: Prakash raj MAA Controversy: తెరపైకి మళ్లీ 'మా' రగడ.. ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
ప్రతిరోజూ త్రిఫల చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు ఉంటాయి, మరియు ఇది పూర్తిగా సహజ సిద్దమైనది కావున ఎలాంటి దుష్ప్రభావాలు రావు. త్రిఫల చూర్ణంని పొడిగా కాని క్యాప్సూల్ రూపంలో కాని తీసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Benefits of Triphala: సర్వరోగనివారిణి "త్రిఫల చూర్ణం" నమ్మట్లేదా..? అయితే ఇది చదవండి
త్రిఫల చూర్ణం వలన కలిగే ప్రయోజనాలు అనేకం
ఇది కళ్ళకి, చర్మానికి మరియు గుండెకి చాలా మంచిది
ఆయుర్వేదం ప్రకారం, ఇది జ్ఞాపకశక్తికి మంచి ఔషదం
ముత్రనాళాల నుంచి ముత్ర విసర్జనకి చాలా దోహదపడుతుంది