Hair Growth Tips At Home In Telugu: ప్రతి ఒక్కరూ జుట్టు అందంగా ఆరోగ్యంగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు. అందమైన జుట్టు కోసం చాలామంది ఎంతో ఖర్చు చేసి ఖరీదైన ప్రొడక్ట్స్ కూడా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా కొంతమందిలో అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అతి చిన్న వయసులోనే బట్టతల సమస్య బారిన పడుతున్నారు. కొంతమందిలోనైతే చుండ్రు సమస్యతో పాటు జుట్టు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ని వాడడమే కాకుండా ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు పోషకాలతో నిండిన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు అందంగా తయారవుతుందని వారు అంటున్నారు. అయితే ఎలాంటి ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు ప్రతిరోజు ప్రొటీన్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. దీంతో పాటు క్రమం తప్పకుండా సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ చేపలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా మృదువుగా ఎంతో అందంగా దృఢంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఒమెగా 3 యాసిడ్స్ జుట్టును దృఢంగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అలాగే ప్రతిరోజు గ్రీక్ పెరుగును ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ గ్రీకు పెరుగులో ఉండే విటమిన్ బి5 జుట్టును బలోపేతం చేయడమే కాకుండా స్కాల్ప్ పై రక్త సరఫరాను పెంచేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే ప్రతిరోజు ఐరన్, బీటా కెరోటీన్, ఫోలేట్, విటమిన్ ఎ వంటి పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా రాలిపోయిన జుట్టు కూడా సులభంగా తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలను తీసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు జామ పండ్లను తినడం వల్ల కూడా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా విరగకుండా కాపాడుతుంది. ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో జుట్టు సమస్యలు ఉన్నవారు తప్పకుండా తృణధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించి జుట్టును ఒత్తుగా తయారు చేసేందుకు సహాయపడతాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter