Green Chilli Health Benefits: పచ్చి మిర్చి ఆహారాల రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే భారతీయు ఎక్కువగా ఆహారాల్లో పచ్చిమిర్చిని వినియోగిస్తూ ఉంటారు. నాన్‌వెజ్ కర్రీస్ నుంచి వెజ్ కర్రీస్ దాకా ప్రతి ఒక కూరలో పచ్చి మిర్చిని వినియోగిస్తూ ఉంటారు. వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల నోటికి రుచే అందడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు ప్రభావంతంగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పచ్చిమిర్చి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
✾ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..మిర్చిలో శరీరానికి కావాల్సిన అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో కలిపి తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని నిరోధించి శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
✾ పచ్చిమిర్చిలో విటమిన్ సి కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లను కూడా ప్రభావంతంగా నివారిస్తుంది.
✾ పచ్చి మిరపకాయల్లో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి రోజు మజ్జిగలో పచ్చిమిర్చి కలుపుకుని తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా కంటి చూపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
✾ మిర్చిలో ఫైబర్ పరిమాణాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
✾ తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు మిర్చిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
✾ పచ్చి మిర్చిలో పొటాషియం, కాల్షియం, ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మైక్రో ఎలిమెంట్స్‌ని అందుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.
పచ్చి మిర్చిని తీసుకునే క్రమంలో వీటిని గుర్తుంచుకోండి:
పచ్చి మిర్చిని ఆహారాల్లో పరిమిత పరిమాణంలో మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. శరీరానికి మేలు చేస్తుందని అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పొట్టలో ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి