Face Pack For Glowing Skin: సీజన్ మారుతున్న కొద్దీ చర్మం సంరక్షించుకోవాలి. లేకపోతే చర్మవ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే సమస్యలు రాకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించడం చర్మానికి చాలా మేలు. ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందిలో చర్మ సమస్యలు వస్తున్నాయి. దీనికోసం మార్కెట్లో లభించే వివిధ రకాలు ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే దీనికోసం ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించి అందమైన చర్మాన్ని పొందవచ్చు. అంతేకాకుండా వాటితో ఫేస్ ప్యాక్ తయారుచేసి వినియోగించవచ్చు. చర్మ సమస్యలు పోవడానికి ఎలాంటి ఫేస్ ప్యాక్‌ను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, తేనె:
పొడి చర్మం ఉన్నవారు పెరుగుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అయితే ఈ పేస్ ప్యాక్ కోసం ఒక కప్పులో పెరుగును తీసుకొని అందులో కొంచెం తేనెను వేసుకొని మిశ్రమంలో కలుపుకొని.. శుభ్రమైన ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
పెరుగు, శనగపిండి:
శనగపిండిలో పెరుగును వేసి బాగా మిక్స్ చేసి.. అందులోనే రెండు స్పూన్ల తేనెను వేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా తయారుచేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మ మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది.
పెరుగు, దోసకాయ:
ప్రస్తుతం చాలామంది జిడ్డు చర్మం సమస్యలతో బాధపడుతున్నారు. ఆధునికల జీవన శైలి కారణంగానే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికోసం పెరుగు, దోసకాయతో తయారుచేసిన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లో వినియోగించవచ్చు. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేయడానికి ముందుగా పెరుగును తీసుకొని అందులో దోసకాయ గుజ్జును వేసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అయిన తర్వాత శుభ్రమైన నీటితో ఆ మిశ్రమాన్ని కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జిడ్డు చర్మం సమస్యలు దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook