Fatty Liver Disease: శరీరంలో కాలేయం గుండె తర్వాత ప్రధాన అవయవం. ఇది శరీరంలోని ఎన్నో రకాల ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం కారణంగా చాలామందిలో కాలేయం రోజురోజుకు చెడిపోతోంది. దీని కారణంగా చాలామందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. శరీరంలోని కాలేయం చెడిపోతే ముఖ్యంగా గుండెపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా గుండె జబ్బులతో పాటు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాలేయం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
ఇంట్లో ఉండే కూరగాయలు కొన్ని రకాల పదార్థాలతో తయారుచేసిన స్మూతీని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. కాలేయ సమస్యలతో బాధపడేవారు..ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు ప్రతిరోజు క్యారెట్, బీట్ రూట్ లతో తయారుచేసిన స్మూతీని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఈ స్మూతీలో ఉండే గుణాలు ఇతర వ్యాధులకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. ఈ స్మూతీ నెల తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
క్యారెట్, బీట్ రూట్ స్మూతీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు క్యారెట్ ముక్కలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే మరో కప్పు బీట్ రూట్ ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ రెండు ముక్కలను వేసుకొని, ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసి అందులోనే వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది.
ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత, ధనియాలు వేసుకొని కొన్ని నీటిని పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఓ నిమిషం పాటు బాగా గ్రైండర్‌ని తిప్పుకొని స్మూతీని గ్లాస్‌లో సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని.. తాగొచ్చు. ఇలా ప్రతిరోజు ఈ స్మూతీని తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం లభించడమే కాకుండా సులభంగా బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా శరీరంలోని కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ స్మూతీని తాగితే గొప్ప ఉపశమనం పొందుతారు.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Fatty Liver: ఈ రెండు కూరగాయలతో చేసిన స్మూతీలతో మీ లివర్ యంగ్‌గా మారుతుంది!