Burn Belly Fat Drink: బెల్లీఫ్యాట్ ఇది ఎన్ని ఎక్సర్ సైజులు, డైట్ చేసిన తగ్గదు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. చూడటానికి కూడా మనం అందవిహీనంగా కనిపించేలా చేస్తుంది. ఈ మొండి బొడ్డుకొవ్వు డయాబెటిస్, కార్డియాక్, పీసీఓఎస్, ఫ్యాటీ లివర్ సమస్యల వల్ల వస్తుంది.
అరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్యప ఆహారం, ఎక్సర్ సైజ్ హెల్తీ డ్రింక్స్ తో తగ్గించుకోవచ్చు. ఈరోజు మనం ఓ ఆరోగ్యకరమైన డ్రింక్ గురించి తెలుసుకుందాం. దీంతో మీ బొడ్డుకొవ్వు తగ్గడంతోపాటు బరువు నిర్వహణకు కూడా సహాయపడుతుంది.
అల్లం చియా వాటర్..
సాధారణంగా అల్లం అంటేనే బరువు తగ్గడానికి ఉపయోగించే సహజసిద్ధమైన పదార్థం. ఇది ఇన్ఫ్లమేషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ రెండిటినీ గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల మొండి బొడ్డుకొవ్వును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఇందులో మెటబాలిజం బూస్టింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఫైబర్ సరైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
ఇదీ చదవండి: స్ట్రాబెర్రీ జ్యూస్ వల్ల ఇన్ని లాభాలు...తెలిస్తే ఈరోజు నుంచే తాగుతారు..
చియా సీడ్స్‌లో పోషకాహారం, వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. థెర్మొజినిసెస్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. బొడ్డుకొవ్వును త్వరగా కరిగిస్తుంది.అల్లం జీర్ణక్రియకు మంచిది. డైజిస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తికి తోడ్పడతాయి. దీంతో ఆహారం క్రమపద్ధతిలో అరుగుతుంది. కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలకు చెక్ పెడుతుంది.
అల్లంలో జింజరోల్, షగోవల్ అనే రెండు సమ్మేళనాలు ఉంటాయి. దీంతో థెర్మోజినిక్ లక్షణాలు ఉంటాయయి. ఇది మెల్లిగా బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది. దీంతో రోజంతా అదనపు కేలరీలను కరిగించేస్తుంది. చియా సీడ్స్ కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జెల్ మాదిరి ఉంటుంది.దీంతో ఆకలి ఎక్కువగా ఉండదు. కడుపు నిండుగా ఎక్కువ సమయం ఉంటుంది.అల్లం, చియా సీడ్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ సమానంగా ఉంచుతాయి.వీటిని తీసుకోవడం వల్ల తీపి తినాలేమనే భావన అనిపించదు.
ఇదీ చదవండి: సర్కోమా కేన్సర్ అంటే ఏమిటి, ఎందుకిది అత్యంత ప్రమాదకరం, లక్షణాలేంటి
కావాల్సిన పదార్థాలు..
చియా సీడ్స్ - 1 TBSP
గ్రేటెడ్ జింజర్ 1 TBSP
నీళ్లు -3 కప్పులు
ఒక గ్లాసులో చియాసీడ్స్, గ్రేట్ చేసిన అల్లం, నీళ్లను బాగా కలపాలి.
దీన్ని 10-15 నిమిషాలపాటు సెట్ అయ్యేలా పక్కన పెట్టండి. అప్పుడు ఇది జెల్ కన్సిటెన్సీలా మారుతుంది. ఎక్కువ సమయం పెడితే మంచి ఫలితం లభిస్తుంది. మీకు కావాలంటే దీనిపై లెమన్ జ్యూస్, తేనె కూడా కలిపి తాగొచ్చు.
అల్లం చియా నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. లేదా ఏదైనా హెర్బల్ టీతో కలిపి తాగాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter