Diabetes Control Tips: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వీటిలో కీలకమైంది, ప్రమాదకరమైంది డయాబెటిస్. లైఫ్‌స్టైల్ వ్యాధిగా పరిగణించే మధుమేహాన్ని నియంత్రించాలంటే లైఫ్‌స్టైల్ మార్చుకోవల్సిందే. అదే సమయంలో కొన్ని హోమ్ రెమీడీస్ పాటిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో డయాబెటిస్ చాలా సాధారణమైపోయింది. మధుమేహం తీవ్రత పెరిగే కొద్దీ పెను అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి, అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు లైఫ్‌స్టైల్, డైట్ విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. లేకపోతే ఒక్కసారిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి ఆరోగ్యం చెడిపోతుంది. ప్రకృతిలో లభించే కొన్ని రకాల పదార్ధాలతో డయాబెటిస్ అద్భుతంగా నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో అత్యంత కీలకమైంది మెంతులు. మెంతి నీళ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. సాధారణంగా వంటల్లో ఉపయోగించే మెంతులతో డయాబెటిస్ సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు.
మెంతి గింజలు శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు అద్బుతంగా ఉపయోగపడతాయి. దాదాపు 10 గ్రాముల మెంతుల్ని వేడి నీటిలో నానబెట్టి తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ఎందుకంటే మెంతుల్లో పుష్కలంగా ఉండే సాల్యుబుల్ ఫైబర్ ఇందుకు ఉపయోగపడుతుంది. ఇందులో గ్లూకోమైనన్ ఫైబర్ కూడా ఉంటుంది. దీనివల్ల షుగర్, ఆల్కలాయిడ్ వంటి ఫెన్గ్రేసిన్, ట్రిగోనెలాయిన్ల సంగ్రహణలో ఆలస్యం జరుగుతుంది. దాంతోపాటు హైపోగ్లైసెమిక్ యాక్షన్, 4 హైడ్రైక్షీ ఐసోల్యూసిన్ ఎమైనో యాసిడ్ అనేది పాంక్రియాస్‌పై పనిచేస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తి సులభమౌతుంది. అందుకే రోజూ ఉదయం పరగడుపున గ్లాసు మెంతి నీళ్లు తాగితే మంచి ఫలితాలుంటాయి.
సీజన్ మారినప్పుడు కచ్చితంగా నానబెట్టిన మెంతులు రోజూ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ ముప్పు తగ్గిపోతుంది.
రోజూ క్రమం తప్పకుండా మెంతులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తవు.
ప్రతిరోజూ ఉదయం పరగడుపున మెంతి నీళ్లు తీసుకునేవారికి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. హార్ట్ ఎటాక్ ముప్పు కూడా తొలగిపోతుంది.
ఇక అన్నింటికంటే ముఖ్యమైంది అధిక బరువు నుంచి ఉపశమనం పొందడం. బరువు నియంత్రించేందుకు మెంతి నీళ్లు చాలా ప్రయోజనకరం. రోజూ క్రమం తప్పకుండా మెంతులు సేవించడం వల్ల శరీరం మెటబోలిజం పెరుగుతుంది. ఫలితంగా అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తూ బరువు నియంత్రణలో ఉంటుంది.
Also read: Weight Loss In 9 Days: అల్లంతో 9 రోజులు బరువు తగ్గే చిట్కా ఇదే..తెలిస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook