Cholesterol Control Tips: బొప్పాయితో చెడు కొలెస్ట్రాల్‌కు ఇలా 10 రోజుల్లో చెక్‌ పెట్టండి..!

Cholesterol Control Tips In 10 Days : పండ్లలో చాలా రకాల పోషకాలుంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే చాలా మంది అంటు వ్యాధులు, వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి  బొప్పాయి పండ్లను వినియోగిస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2022, 03:42 PM IST
  • బొప్పాయి పండును తినడం వల్ల..
  • 10 రోజుల్లోనే కొలెస్ట్రాల్, ఊబకాయం
  • జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి
Cholesterol Control Tips: బొప్పాయితో చెడు కొలెస్ట్రాల్‌కు ఇలా 10 రోజుల్లో చెక్‌ పెట్టండి..!

Cholesterol Control Tips In 10 Days : పండ్లలో చాలా రకాల పోషకాలుంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే చాలా మంది అంటు వ్యాధులు, వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి  బొప్పాయి పండ్లను వినియోగిస్తారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే బొప్పాయి ఆకులు, పండ్లు, గింజలు అనారోగ్య సమస్యలపై ప్రభావవంతంగా పని చేస్తాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. బొప్పాయిలో మినరల్, విటమిన్, ప్రొటీన్, ఫైబర్, ఎనర్జీ వంటి గుణాలు ఉంటాయి.  ఇవి  మంటల నుంచి నొప్పుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇది శరీరానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాండా రక్తాన్ని శుభ్రం చేసి శరీరంలో రెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ముఖ్యంగా బరువు సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

క్రమం తప్పకుండా బొప్పాయి తినడం వల్ల ప్రయోజనాలు:

1. కొలెస్ట్రాల్:

శరీరంలో చెడు పెరిగితే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.  బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్, ఫైబర్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి చెడు కోలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు సహాయపడతాయి.

2. జీర్ణక్రియ:

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ప్రేగు కదలికలను సులభతరం చేసి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బొప్పాయిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.

3. ఊబకాయం:

బొప్పాయిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిండానికి సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిలో నీటిశాతం ఎక్కువ పరిమాణంలో ఉండి.. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4. కంటి చూపును పెంచుతుంది:

బొప్పాయి తీసుకోవడం జీర్ణక్రియ సమస్యలేకాకుండా కంటి చూపును కూడా పెంపొందిస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ బొప్పాయిలో లభిస్తాయి. కావున కళ్లను ప్రకాశవంతంగా చేస్తాయి.

5. రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

ఈ పండులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేని శరీరాన్ని దృఢంగా చేస్తాయి. వ్యాధుల సంక్రమణ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్‌ టెర్రర్..తాజాగా మరో అనుమానిత కేసు నమోదు..!

Also Read: IND vs WI 3rd ODI: మూడో వన్డేకు వరణుడి ముప్పు.. మ్యాచ్ కష్టమే!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News