Vegetables For Hair Growth: తక్కువ ఖర్చుతో కేవలం కూరగాయలతో జుట్టు పెరిగే మార్గం

Hair Growth Vegetables: కారణాలు ఏవైనా జట్టు పెరగడం లేదు అనే బాధపడే వారి సంఖ్య అయితే అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. జుట్టు పెరగాలంటే ఖరీదైన వైద్యమే అవసరం లేదు.. ఖరీదైన ఆహారమే అసలే అవసరం లేదు. చక్కటి ఆహారం.. అందులోనూ కొన్నిరకాల కూరగాయలతో కూడిన డైట్ తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు సంబంధిత నిపుణులు.   

Written by - Pavan | Last Updated : Sep 21, 2023, 04:23 AM IST
Vegetables For Hair Growth: తక్కువ ఖర్చుతో కేవలం కూరగాయలతో జుట్టు పెరిగే మార్గం

Hair Growth Vegetables: ప్రస్తుతం చాలామందిని వేధిస్తోన్న సమస్యల్లో జుట్టు ఊడిపోవడం ఒక సమస్య కాగా.. ఊడిన జుట్టు మళ్లీ పెరగకపోవడం ఇంకో సమస్యగా కనిపిస్తోంది. జుట్టు ఊడిపోవడం లేదా జుట్టు రాకపోవడం వంటి సమస్యలకు లైఫ్ స్టైల్ కారణం కావొచ్చు లేదా పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తీసుకోకుండా జంక్ ఫుడ్స్ తినడం మరొక కారణం కావచ్చు.. ఇలా కారణాలు ఏవైనా జట్టు పెరగడం లేదు అనే బాధపడే వారి సంఖ్య అయితే అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. 

జుట్టు పెరగాలంటే ఖరీదైన వైద్యమే అవసరం లేదు.. ఖరీదైన ఆహారమే అసలే అవసరం లేదు. చక్కటి ఆహారం.. అందులోనూ కొన్నిరకాల కూరగాయలతో కూడిన డైట్ తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు సంబంధిత నిపుణులు. 

పాలకూర :
పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది మీ జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది. అందుకే మీ డైట్లో పాలకూర కూడా ఉండేలా చూసుకోండి.

ఎల్లిపాయ : వెల్లుల్లిపాయలో జింక్ అధికంగా ఉంటుంది. జింక్ జుట్టు పెరిగేలా చేయడంతో పాటు జుట్టు బలంగానూ మారేందుకు సహాయపడుతుంది.

కరివేపాకు : 
కరివేపాకే కదా అని అలా తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే.. కరివేపాకులో ఉండే కెరాటిన్ అనే మూలకం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

బీట్రూట్స్ : 
బీట్రూట్స్ వంటి కూరగాయల్లో నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లలో రక్త సరఫరా పెంచి జుట్టు పెరిగేందుకు సహాయతపడుతుంది.

ఫ్రెంచ్ బీన్స్ : 
ఫ్రెంచ్ బీన్స్ లో ప్రోటీన్స్, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడకుండా ఉంచి నల్ల రంగును కోల్పోకుండా కాపాడుతాయి.

క్యారట్స్ : 
క్యారెట్స్ లో విటమిన్ A ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడటంతో పాటు జుట్టును మెరిసేలా చేస్తుంది.

పచ్చిమిరప కాయలు : 
చాలామంది పచ్చిమిరప కాయలు కేవలం రుచి కోసం లేదా ఘాటు కోసం మాత్రమే వేస్తారు తప్ప వీటితో ఏం ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని అనుకుంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే.. పచ్చి మిరపకాయల్లోనూ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఉల్లిపాయలు : 
ఉల్లిపాయల్లో బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరిగేందుకు ఉపయోగపడటంతో పాటు కొత్తగా వచ్చే జుట్టు బలంగా ఉండేలా చూస్తుంది.

ఇది కూడా చదవండి : Protein Poisoning: మితిమీరిన మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే..మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకున్నట్టు!

ఆరెంజ్ వెజిటేబుల్స్ :
ఆరెంజ్ రంగులో ఉండే క్యాప్సికం వంటి కూరగాయల్లో విటమిన్ C ఉంటుంది. ఇవి కూడా జుట్టు పెరుగుదలలో తన వంతు పాత్ర పోషిస్తాయి.

ఇది కూడా చదవండి : Healthy Breakfast Ideas: తక్కువ సమయంలో చేసుకునే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు

(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించడానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News