Black Raisins Facts: నల్ల ద్రాక్షలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో అనేక రకాల పోషక గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయాన్నే వీటిని తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే నల్ల ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలతో పాటు పదుల సంఖ్యలో పోషకాలు లభిస్తాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు డైట్‌లో భాగంగా తీసుకుంటే బోలెడు లాభాలు కలుగుతాయి. ఇవే కాకుండా వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.
నల్ల ద్రాక్షను తినడం వల్ల కలిగే లాభాలు:
గుండె ఆరోగ్యం కోసం:
నల్ల ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి రోజు ఉదయం పూట తినడం వల్ల రక్తనాళాలు శుభ్రమవుతాయి. దీంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
క్యాన్సర్ నిరోధకం:
నల్ల ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పకుండా నల్ల ద్రాక్షను తినాల్సి ఉంటుంది.
జీర్ణ వ్యవస్థకు మేలు:
నల్ల ద్రాక్షలో ఉండే ఫైబర్ పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా పొట్ట కూడా ఆరోగ్యంగా మారుతుంది.
చర్మ సంరక్షణ:
నల్ల ద్రాక్షలోని చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారాల్లో తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. దీంతో పాటు ముడతలు, మచ్చలు లేని చర్మాన్ని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
కంటి ఆరోగ్యానికి:
నల్ల ద్రాక్షలో విటమిన్ ఎ పుష్కలంగ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ముఖ్యంగా కంటి ఎరుపు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తప్పకుండా నల్ల ద్రాక్షను తినండి.
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.