Best Skin Care Tips: చర్మ సమస్యల కారణంగా చాలా మంది అందహీనంగా మారుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఇంట్లో తయారు చేసిన లెమన్‌గ్రాస్ సబ్బును వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యల నుంచి కూడా సులుభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా చర్మానికి లోతైన పోషణను అందించేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి ఈ సబ్బును ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సబ్బును తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
✺ ఎండబెట్టి, తరిగిన లెమన్‌గ్రాస్
✺ 100 గ్రాముల గ్లిజరిన్
✺ సబ్బు కోసం మౌల్డింగ్
✺ 1 టీస్పూన్ రుబ్బింగ్ ఆల్కహాల్
✺ 7 డ్రాప్స్ లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
లెమన్ గ్రాస్ సబ్బు తయారి:
✺ ఈ సబ్బును తయారు చేయడానికి ముందుగా గ్లిజరిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
✺ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి విడిగా ఉంచుకోవాలి.
✺ ఒక పాన్లో నీరు పోసి..మధ్యలో ఒక పాత్రను ఉంచాల్సి ఉంటుంది.
✺ ఆ పాత్ర పై ముక్కలు వేసి కరిగించుకోవాలి.
✺ ఇలా కరిగించుకున్న మిశ్రమంలో ఎండబెట్టి, తరిగిన లెమన్‌గ్రాస్ వేసుకోవాలి.
✺ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి రబ్బింగ్ ఆల్కహాల్, లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
✺ పై మిశ్రమాన్ని సబ్బు అచ్చులో పోసి పక్కన పెట్టుకోవాలి.
✺ అంతే సులభంగా ఇంట్లోనే లెమన్‌గ్రాస్ సబ్బు తయారైనట్లే..
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి