Home Remedies For Sun tan: మనం బయటకు వెళ్లి పని చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మన ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. ఎక్కువగా ఎండ తగిలినా కానీ ముఖం ట్యాన్ అయిపోయి నల్లగా మారిపోతుంది. దీనికి స్కిన్ కేర్ వస్తువులు ఉన్నాయి. కానీ ఇవి ముఖంపై సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. వేల ఖర్చుతో కూడుకున్నవి అయితే ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా ముఖంపై ఈజీగా తొలగించుకోవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.
నిమ్మరసం..
నిమ్మరసం లో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. తాజా నిమ్మరసాన్ని పిండి నేరుగా మన స్కిన్ పై అప్లై చేయవచ్చు. ట్యాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల ఈ ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలిగిపోతుంది. ఇదో ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ట్యాన్ సహజసిద్ధంగా తొలగిపోతుంది.
పసుపు, పెరుగు..
రెండు వస్తువుల్లో మన ముఖాన్ని మృదువుగా మార్చే గుణాలు కలిగి ఉంటాయి. పసుపులో ఎక్స్‌ఫోలియేట్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు కలిగి ఉంటుంది. పెరుగు, పసుపు రెండు కలిపి ముఖం ట్యాన్ అయిన ప్రదేశంలో అప్లై చేసి ఆరు గంట తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.
కలబంద జెల్..
దీంట్లో మాయిశ్చరైజ్ ఇచ్చే గుణాలు ఉంటాయి. అంతేకాదు చర్మాన్ని చల్లబరిస్తుంది. కలబంద కూడా సులభంగా ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలగిస్తుంది. కలబందను రాసి అరగంట తర్వాత సాధన నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
కీరదోస పేస్ట్..
కీరదోస పేస్ట్ ను కూడా సన్ బర్న్ ప్రదేశాల్లో అప్లై చేయాలి. దీని కోసం కీరదోసను పేస్ట్ చేసి ట్యాన్ అయిన ప్రదేశాల్లో అప్లై చేసి ఓ 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్ల నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి ఇది కూడా ఈజీగా తొలగిస్తుంది.
ఇదీ చదవండి: అవిసెగింజలతో 5 హెయిర్ ప్యాక్‌లు.. పార్లర్‌కు వెళ్లకుండానే మెరిసే మృదువైన జుట్టు మీ సొంతం..
బంగాళదుంప రసం..
బంగాళదుంపలో ముఖానికి సహజ మెరుపును ఇచ్చే గుణం కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. బంగాళ దుంపను బ్లెండ్ చేసి రసం తీసి కాటన్ బాల్ తో ముఖం ట్యాన్ అయిన ప్రదేశంలో అప్లై చేసి ఓ 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేయాలి.
బొప్పాయి మాస్క్..
బొప్పాయిలో పప్పైన్ ఉంటుంది ఇందులో ఎక్స్పోజింగ్ గుణాలు ఉంటాయి. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. పండిన బొప్పాయి తీసుకొని ట్యాన్ ప్రదేశంలో ఓ అరగంట పాటు అప్లై చేసి గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: టమాటా మిరియాల రసం ఇలా చేస్తే అన్నం పక్కనపెట్టి రసమే తాగేస్తారు..
ఓట్మీల్ స్క్రబ్..
ఓట్మీల్ కూడా ఎక్స్పోలీయేటర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి చర్మంపై పేర్కొన్నట్యాన్ తొలగిస్తుంది, ఓట్మీల్ బట్టర్ మిల్క్ కలిపి రెండు ముఖంపై సర్కిల్ మోషన్లో రుద్దాలి. ట్యాన్ అయిన ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి