Samantha: సమంత ఏంటి ఇలా అయిపోయింది.. వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు..!

Samantha Video: సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో అందరిదీ మాయ చేసింది ఈ హీరోయిన్. అయితే కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత.. ఈమధ్య తన తండ్రిని కూడా పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 8, 2025, 08:27 PM IST
Samantha: సమంత ఏంటి ఇలా అయిపోయింది.. వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు..!

Samantha Viral Video: ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత. ఆ తరువాత వరుస విజయాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ఇక తెలుగులో తన మొదటి సినిమా హీరో అయినా నాగచైతన్య అనే ప్రేమించి మరి పెళ్లారింది ఈ హీరోయిన్. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల.. వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నుంచి పర్సనల్ లైఫ్ లో కొన్ని బాధలు ఎదుర్కొంటూ వచ్చింది ఈ హీరోయిన్.

ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల సమంత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకున్న సమంత.. మళ్లీ ఈ మధ్య సినిమాలు వరుసగా ఒప్పుకొని.. బిజీ అయిపోయింది. యశోద, శాకుంతలం, ఖుషీ లాంటి తెలుగు చిత్రాలలో కనిపించిన సమంత.. మరోపక్క బాలీవుడ్ లో సైతం సీటాడల్.. వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. 

ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఇంస్టాగ్రామ్ లో తన పోస్టుల ద్వారా కూడా తెగ ఆక్టివ్ గా ఉంటుంది సమంత.  అయితే సమంత ఈమధ్య తన తండ్రిని పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.  అందుకే ఇన్స్టాగ్రామ్ కి సైతం కొంచెం దూరంగా ఉంటోంది.. 

Samantha Health: ఈ నేపథ్యంలో సమంత బయట కనిపించగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఆమె అభిమానులను తెగ కలవరపరుస్తోంది. ఈ వీడియోలో సమంత చాలా సన్నగా అయిపోయి.. ఏదో అనారోగ్యంతో పోరాడుతున్నట్టు కనిపించింది. అసలు సమంతా ఏంటి ఇలా అయిపోయింది అని ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. సమంత నిజంగానే కోలుకుండా.. లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఇంకా ఏమైనా వెంటాడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా సమంత కూడా తన అనారోగ్యానికి ఇంకా చికిత్స పొందుతున్నట్టు కొన్నిసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత ఎప్పుడు పూర్తిగా కోలుకొని మళ్ళీ.. అంతకుముందులా కనిపిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు అందరూ.

 

Read more: Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలి పోస్ట్ వైరల్.. ఈ పోస్ట్ లో ఏం చెప్పారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News