Benefits Of Neem: వేప ఆకులతో కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు..ఆశ్చర్యపోకండి! ఇలా చేయండి..

Benefits Of Neem: వేప ఆకులతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2023, 05:37 PM IST
Benefits Of Neem: వేప ఆకులతో కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు..ఆశ్చర్యపోకండి! ఇలా చేయండి..

Benefits Of Neem: శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది.  రక్తంలోని రెండు రకాల లిపోప్రొటీన్లు ఉంటాయి. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL)అని, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL)లుగా పిలుస్తారు.  అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. LDLని చెడు కొలెస్ట్రాల్‌గా, HDLని మంచి కొలెస్ట్రాల్‌గా పిలుస్తారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ రక్త నాళాలపై గోడలను ఏర్పాటు చేస్తాయి. దీనినే చాలా మంచి ప్లేక్‌ అని అంటారు. దీని కారణంగా గుండెకు ఆక్సిజన్, రక్తం చేరడంలో అడ్డంకులు ఏర్పడతాయి. దీని కారణంగా అనేక రకాల గుండె సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. 

చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు సులభంగా బరువు పెరుగుతూ ఉంటారు. అంతేకాకుండా అధిక రక్తపోటు ఇతర సమస్యల బారిన పడతారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన వేప ఆకులను వినియోగించాల్సి ఉంటుంది. వీటిలో ఉండే ఆయుర్వేద గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ వేప ఆకులను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

వేపలో ఉండే ఆయుర్వేద గుణాలు:
వేపలో శరీరానికి కావాల్సిన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ మలేరియా లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

వేప వల్ల శరీరానికి కలిగే లాభాలు:
వేప ఆకుల రసం తాగితే రక్తం శుద్ధవుతుంది.
వేపలో ఉండే గుణాలు రక్తంలోని వ్యర్థ్యలను తొలగిస్తాయి.
రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది.
శరీర బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి వేపను ఇలా వినియోగించండి:
ఖాళీ కడుపుతో వేప ఆకులను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వేప ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తాయి.
వేప ఆకులలో నింబిడిన్ అనే పదార్ధం లభిస్తుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.
వేపలో ఉండే గుణాలు రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపరుచుతాయి.
వేప ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే కరోనరీ హార్ట్ డిసీజ్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
వేప ఆకుల రసం రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News