Benefits Of Curd For Hair: పెరుగు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. క్యాల్షియంతో పాటు, మెగ్నీషియం, విటమిన్ బి5, విటమిన్ డి, ప్రోటీన్ వంటి మూలకాలు పెరుగులో అభిస్తాయి. పెరుగును చర్మానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే..అయితే ఈ పెరుగును జుట్టు సౌదర్యం కోసం కూడా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా షాంపూకి బదులుగా జుట్టు అప్లై చేస్తే జుట్టు దృఢంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగును జుట్టుకు వినియోగించడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పెరుగును జుట్టుకు వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చుండ్రు తొలగిపోతుంది:
పెరుగులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రు సమస్యను తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జుట్టు ప్రధాన సమస్యలైన జుట్టు రాలడం వివిధ రకాల సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చిట్కాను వినియోగించే ముందు కొన్ని వస్తువులతో మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. శెనగపిండిలో అరకప్పు పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత 20 నిమిషాల పాటు ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.
జుట్టు పెరుగుదలను పెంచుతుంది:
పెరుగు జుట్టును కుదుళ్ల నుంచి బలంగా చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దృఢంగా కూడా తయారవుతుంది. కాబట్టి పైన పేర్కొన్న మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.
జుట్టులో దురద సమస్యలు:
వాతావరణంలో మార్పు కారణంగా చాలా మంది జుట్టులో వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది దురద సమస్యలతో కూడా బాధపడుతున్నారు. విపరీతమైన దురద వల్ల శిరోజాలు దెబ్బతింటాయి. అయితే పెరుగులో నిమ్మరం కలిపి తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
హెయిర్ మాస్క్:
పెరుగును జుట్టుకు హెయిర్ మాస్క్‌గా కూడా వినియోగించుకోవచ్చు. దీనిని ఉపయోగించడానికి ముందు తలస్నానం చేసే ముందు పెరుగుతో తయారు చేసిన మాస్క్‌ను అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును బాగా కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా ఈ జుట్టు సమస్యలు చెక్ పెట్టొచ్చు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook