Cabbage Benefits: మలబద్దకం, బరువు తగ్గటం, డయాబెటిస్.. అన్నిటికి చెక్ పెట్టె క్యాబేజీ

Benefits of Cabbage: క్యాబేజీ పోషకాల గని అనే చెప్పాలి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2023, 11:53 AM IST
Cabbage Benefits: మలబద్దకం, బరువు తగ్గటం, డయాబెటిస్.. అన్నిటికి చెక్ పెట్టె క్యాబేజీ

Cabbage for Diabetic Patients: కూరగాయలు తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అలాంటి వాటిల్లో ఒకటి క్యాబేజీ. ఆకు పచ్చ కూరలు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. 

క్యాబేజీ శాస్త్రీయ నామం బ్రాసికా ఒలేరేసియా. ఇందులో విటమిన్ సి, ఫైబర్ మరియు విటమిన్ K సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చాలా రంగుల్లో లభిస్తుంది. ముఖ్యంగా ఎరుపు, ఊదా, తెలుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో ఉండేవి ఎక్కువగా ఉంటాయి. క్యాబేజీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

క్యాబేజీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు 

మధుమేహం
క్యాబేజీ డయాబెటిక్ రోగులకు వరమనే చెప్పాలి. ఎందుకంటే ఈ కూరగాయ యాంటీహైపెర్గ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోస్ టాలరెన్స్‌ని మెరుగుపరచడంతోపాటు ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతుంది.

మలబద్ధకం 
క్యాబేజీలో ఫైబర్, ఆంథోసైనిన్స్ మరియు పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిని తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ లేదా ఉదరానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. 

Also Read: Benefits of drumsticks: మునగకాయతో నమ్మలేని ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..!

బరువు తగ్గడం
క్యాబేజీలో పోషకాలు మెండుగా ఉంటాయి. పైగా ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ నడుమ చుట్టూ కొవ్వు పెరగదు. దీంతో మీరు సులభంగా బరువు తగ్గుతారు. 

రోగనిరోధక శక్తి పెరగడం
క్యాబేజీలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. మీరు మీ రెగ్యులర్ డైట్‌లో క్యాబేజీని చేర్చుకోవడం ద్వారా మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం మీకు తగ్గుతుంది. 

(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Best Veg Foods: ఈ కూరగాయల్ని రాత్రి పూట మార్చి మార్చి తింటే, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ అన్నీ మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News