Skin Glowing Tips In 5 Days: రష్మిక మందన్న లాగా మీ స్కిన్ మెరిసిపోవాలా.. ? అయితే దీన్ని అప్లై చేయండి!

Beetroot Juice For Skin: చర్మ సౌదర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రముఖ నటి, నటులు కూడా బీట్‌రూట్‌ రసాన్ని వినియోగిస్తారాట.. ముఖ్యంగా అందాల తార రష్మిక మందన్న కూడా ఈ రసాన్నే తరచుగా వినియోగిస్తుందని సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 12:53 PM IST
Skin Glowing Tips In 5 Days: రష్మిక మందన్న లాగా మీ స్కిన్ మెరిసిపోవాలా.. ? అయితే దీన్ని అప్లై చేయండి!

Beetroot Juice For Skin in 5 Days: చలికాలంలో మార్కెట్లో విచ్చలవిడిగా ఆకుకూరలు దుంపలు తాజాగా లభిస్తాయి. ఎందుకంటే ఈ వాతావరణం లోనే ఎక్కువగా దుంపలు పండుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో అధికంగా లభించే దుంపల్లో బీట్‌రూట్‌ ఒకటి. ఇది చూడడానికి ఎర్రని రంగులో ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు దాగి ఉంటాయి. కాబట్టి వైద్యులు వీటిని నిత్యం ఆహారంలో తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. చలికాలంలో వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని సులభంగా రక్షించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న కూడా అందాన్ని పెంచుకోవడానికి బీట్‌రూట్‌ నుంచి తీసిన రసాన్ని వినియోగిస్తుందని సమాచారం. మందన ప్రతిరోజు రసాన్ని తీసుకోవడమే కాకుండా తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి సలాడ్స్‌లో బీట్‌రూట్‌ను వినియోగిస్తుందని తెలుస్తోంది.

ప్రతిరోజు ఈ బీట్‌రూట్‌ తో తయారుచేసిన సలాడ్స్ ను తీసుకుంటే చలికాలంలో ఉత్పన్నమయ్యే చర్మవ్యాధులు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే చర్మం పగుళ్ల సమస్యలు సులభంగా నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..

చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి బీట్‌రూట్‌ ని ఇలా ఉపయోగించండి..

1. చర్మం చలికాలంలో కూడా మెరుస్తూ ఉండాలంటే బీట్‌రూట్‌ రసాన్ని తీసి ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మానికి పోషకాలు అంది ముఖం మెరుస్తూ ఉంటుంది.

2. పెరుగులో బీట్‌రూట్‌ రసాన్ని కలిపి ముఖానికి అప్లై చేసిన రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చర్మంపై మొటిమల సమస్యలు కూడా దూరం అవుతాయి.

3.బీట్‌రూట్‌, కలబందను ఫేస్ మాస్కులా చేసి వినియోగించినా కూడా వాతావరణ మార్పుల కారణంగా వచ్చే చర్మ సమస్యలు సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా కాలుష్యం కారణంగా వచ్చే చర్మవ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు

4. కొబ్బరి నూనెలో బీట్‌రూట్‌ రసాన్ని కలిపి ముఖానికి మసాజ్ చేస్తే ముఖం పొడిబారకుండా తయారవుతుంది. అంతేకాకుండా ముఖంపై సులభంగా మెరుపు కూడా వస్తుంది. కాబట్టి ముఖంపై చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించాలి.

Also Read : Avatar The Way Of Water టికెట్ రేట్లు.. జేబులు గుల్ల అవ్వాల్సిందేనా?

Also Read : Keerthy Suresh pics : 8వ శతాబ్దం నాటి పురాతన గుడిలో మహానటి.. కీర్తి సురేష్ ఎంత సింపుల్‌గా ఉందో.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News