How To Make Banana Lassi at Home: వేసవి కారణంగా డిహైడ్రేషన్ కు గురవుతారు. దీని కారణంగా శరీరం రోజంతా నీరసం, బలహీనతతో బాధపడతారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎండలో బయటికి వెళ్లేవారు నీటితోపాటు ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను కూడా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. తరచుగా డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్న వారు లస్సీని తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. అందులో బనానాతో తయారుచేసిన లస్సీని తాగితే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు బనానా తో తయారు చేసిన లస్సీని తాగడం వల్ల శరీరం దృఢంగా తయారవ్వడమే కాకుండా, యాక్టివ్గా కూడా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అరటి పండు లస్సిలో ఉండే గుణాలు ఎండా కారణంగా వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్ కారణంగా వచ్చే నీరసం నుంచి కేవలం 20 నిమిషాల్లో విముక్తి కలిగించి శరీరానికి రిఫ్రేష్మెంట్ ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ బనానా లస్సీని ఎలా తయారు చేసుకోవాలో..? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బనానా లస్సీకి కావాల్సిన పదార్థాలు:
- ఒక కప్పు బనానా ముక్కలు
- ఒక కప్పు పాలు
- రెండు కప్పుల పెరుగు
- ఒక చిన్న కప్పు బెల్లం తురుము
- ఒక చిన్న కప్పు ఖర్జూర తురుము
- రుచికి సరిపడాల్సినంత తేనె
- చిటికెడు యాలకుల పొడి
Also Read: Chia Seeds For Weight Loss: కాఫీలో చియా విత్తనాలు కలుపుకుని తాగితే వేగంగా బరువు తగ్గడం ఖాయం!
బనానా లస్సీ తయారీ విధానం:
- ముందుగా ఒక ఖాళీ కప్పు తీసుకొని అందులో పెరుగు, బనానా ముక్కలను వేసి మిక్స్ చేసుకోవాలి.
- ఇలా ఈ రెండింటిని మిశ్రమంలో తయారయ్యే దాకా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం తురుము వేసుకోవాలి.
- ఇలా మూడింటిని బాగా మిక్స్ చేసుకొని మిశ్రమంలో చిక్కటి పాలు కలుపుకోవాలి.
- ఇలా పాలను కలుపుకున్న తర్వాత మిగిలిన పదార్థాలను వేసుకొని బాగా కలుపుకొని, ఫ్రిజ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది.
- 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుని తాగితే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook