Anti Ageing Foods For Women: ఎప్పుడైనా కానీ మనం యవ్వనంగా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో వేలు కూడా ఖర్చు పెడతాం.అయితే కొన్ని రకాల ఆహారాలు మన డైట్లో ఉన్నా కానీ, నిత్య యవ్వనంగా సహజసిద్ధంగా కనిపిస్తాం. దీనికి యాంటీ ఎజింగ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. 40 లో కూడా మీరు యవ్వనంగా కనిపించాలంటే ఈ ఫ్రూట్స్ మీ డైట్ లో ఉండాల్సిందే. ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఆక్సిడేటివ్ డామేజ్ కాకుండా నివారిస్తాయి. ఇందులో ఇన్ల్ఫమేషన్ తగ్గించి ఫ్రీరాడికల్ సమస్య నుంచి కాపాడతాయి. యాంటీ ఏజింగ్ ఫుడ్స్ లో బెర్రీ, నట్స్, సీడ్స్, ఆకుకూరలు వంటివి ఉన్నాయి.
ఇవి కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు మీ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, అవకాడో, సాల్మన్ వంటివి మీ డైట్ లో ఉన్నాయంటే మీరు నిత్యా యవ్వనంగా కనిపిస్తారు. త్వరగా వృద్ధాప్య ఛాయలు మీ ముఖంపై రాకుండా ఉంటాయి. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
బ్రోకోలి..
బ్రోకోలి యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటాయి. ఇది చర్మంపై త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది. ఇది సూపర్ ఫుడ్ ఇందులో ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాదు బ్రోకోలిలో విటమిన్ సి, కే, పొటాషియం ఫోలేట్ ఉంటుందని ఎన్‌ఐహెచ్ నివేదిక తెలిపింది.
అవకాడో..
అవకాడో యాంటీ ఏజింగ్ జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం, విటమిన్స్, ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కూడా ఏజింగ్ సమస్యలు రాకుండా నివారించే శరీర ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.
ఫిగ్స్..
ఇవి కూడా స్కిన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరా ఆరోగ్యానికి కూడా మంచిది ఆక్సిడేటివ్స్ స్ట్రెస్ నుంచి నివారించి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో ఉండే పాలి ఫైనల్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ త్వరగా వృద్ధాప్యం రాకుండా నివారిస్తుందని ఎన్‌ఐహెచ్ తెలిపింది
ఇదీ చదవండి: రాగి పిండి రోటీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం.. రక్తంలో చక్కెరస్థాయిలు హఠాత్తుగా పెరగవు..!
పాలకూర..
పాలకూర కూడా చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇవి టిష్యూ అభివృద్ధికి ప్రోత్సహిస్తుంది. ఇందులో ఇలాంటి ఆక్సిడెంట్ పోలిక్ యాసిడ్ ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి ఉండటం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వంకాయ..
వంకాయలో కూడా అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ స్కిన్ ఆరోగ్యానికి తోడ్పడుతాయి ఫ్రీ రాడికల్స్ కాకుండా నివారిస్తుంది ఎన్ఐహెచ్ నివేదిక తెలిపింది.
టమాటా..
టమాటలో ఉండే లైకోపీన్, కెరోటీన్ మంట సమస్యను తగ్గిస్తాయి. ఇది సూర్యుని హానికర కిరణాల నుంచి కాపడతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వృద్ధాప్య సమస్యలు రాకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: ఈ 7 మార్నింగ్ ఆహారాలతో యూరిక్ యాసిడ్, గౌట్, కిడ్నీ సమస్యలు కూడా మాయం..
స్వీట్ పొటాటో..
స్వీట్ పొటాటో లో కూడా బేటాకెరొటీన్ ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ తక్కువ మోతాదులో ఉండటం కార్బోహైడ్రేట్ ప్రోటీన్స్ వల్ల ఇది యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటుందని ఎన్‌ఐహెచ్ నివేదిక తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి