How To Make Anti Hair Fall Oil At Home: నలుపు, మందపాటి, పొడవాటి జుట్టును కావాలని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. అంతేకాకుండా ఇలాంటి జుట్టును పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. ఎన్ని ప్రోడక్ట్స్ వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఆయుర్వేద నిపుణలు సూచించిన ఎఫెక్టివ్ హోం రెమెడీ వినియోగించడం వల్ల ఎలాంటి ఖర్చులేకుండా మీరు కోరుకున్న జుట్టును పొందవచ్చు. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్య కూడా సులభంగా తగ్గుతుంది. అయితే ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల సులభంగా నలుపు, మందపాటి జుట్టును పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ తయారీకి కావలసిన పదార్థాలు:
✽ అలోవెరా జెల్
✽ ఆవాల నూనె
✽ ఉల్లిపాయ రసం
Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన
యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ తయారి విధానం:
✽ యాంటీ హెయిర్ ఫాల్ నూనెను తయారు చేయడానికి ముందుగా ఉల్లిపాయలను తీసుకోవాల్సి ఉంటుంది.
✽ ఆ తర్వాత ఉల్లిపాయలను బాగా తురుముకోవాల్సి ఉంటుంది. చిన్నగా కోసిన తర్వాత వాటి నుంచి రసం తీయాల్సి ఉంటుంది.
✽ ఓ చిన్న బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ రసం, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, ఆవాల నూనెను మూడింటిని వేసుకోవాలి.
✽ తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకుంటే..సులభంగా యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ సిద్ధమైనట్లే.
ఈ నూనెను వినియోగించే పద్ధతి:
✽ ఈ ఆయిల్‌ను అప్లై చేయడానికి ముందుగా మీ జుట్టును బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
✽ ఆ తర్వాత మీ జుట్టు రూట్స్ లోపలి దాకా ఈ నూనెను అప్లై చేయాలి.
✽ ఇలా అప్లై చేసిన తర్వాత 6 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి.
✽ ఆలా అప్లై చేసిన రెండు గంటల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
✽ ఈ నూనెను క్రమం తప్పకుండా అప్లై చేస్తే చుండ్రు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anti Hair Fall Oil: ఈ నూనెతో 20 రోజుల్లో రాలిపోయిన జుట్టు కూడా తిరిగి రావడం ఖాయం..