Aloe Vera For Skin Care: అలోవెరాలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి చాలా మంది దీనిని చర్మంతో పాటు జుట్టుకు వినియోగిస్తూ ఉంటారు. చాలా మంది దీనిని చర్మ సమస్యలకు వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే మూలకాలు చర్మాన్ని కాంతి వంతంగా చేయడమే కాకుండా మొటిమలను, మచ్చలను తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మ సమస్యలు దూరమవుతాయి. అయితే చర్మానికి ఈ అలోవెరాను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చర్మంపై మచ్చలు ఎందుకు వస్తాయంటే..?:
శరీరంలో రక్తం లేకపోవడం, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా ముఖంపై మచ్చలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎండలో ఎక్కువగా తిరగం కారణంగా కూడా ఎక్కువగా మచ్చలు, చర్మపై అలెర్జీ రావచ్చు. కాబట్టి పోషకాలు అధిక మోతాదులో కలిగిన ఆహారాలు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
అలోవెరా చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది?
కలబందలో ఎన్నో ఔషధ గుణాలు లభిస్తాయి. దీంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్, హైడ్రేటింగ్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మపు మచ్చలు, టానింగ్, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుంచి సులభంగా ఉఫశమనం కలుగుతుంది. అంతేకాకుండా కంటి చుట్టూ ఉండే వలయాలు కూడా దూరమవుతాయి.
కలబందతో చిన్న మచ్చలకు చెక్:
ముఖంపై మచ్చలు ఉండడం వల్ల అందం కోల్పోతారు. అందుకే చాలా మంది వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే పలు రకాల రసాయనాలతో కూడి స్కిన్ కేర్ ప్రోడక్ట్ వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటికి బదులుగా పచ్చలు కలిగిన ప్రభావిత ప్రాంతాల్లో కలబందను అప్లై చేస్తే శాశ్వతంగా మచ్చలు దూరమవుతాయి. అంతేకాకుండా ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
కలబందను వినియోగించే పద్ధతి:
ముందుగా ఒక చిన్న కప్పును తీసుకోవాల్సి ఉంటుంది.
అందులో 2 స్పూన్ల కలబంద గుజ్జును తీసుకోవాలి.
ఇందులోనే రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.
ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు పట్టిస్తే ముఖం అందంగా మచ్చలేకుండా తయారవుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి