EPF Benefits: మీ పీఎఫ్ ఎక్కౌంట్‌కు..ఈ దరఖాస్తు సమర్పించండి.. 7 లక్షల ప్రయోజనం

EPF Account: పీఎఫ్ ఎక్కౌంట్‌తో సరికొత్త ప్రయోజనాలున్నాయి. ఒక్క దరఖాస్తు నింపుకుంటే చాలు..7 లక్షల వరకూ ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటి, ఏ దరఖాస్తు నింపాలనేది తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2022, 08:17 PM IST
EPF Benefits: మీ పీఎఫ్ ఎక్కౌంట్‌కు..ఈ దరఖాస్తు సమర్పించండి.. 7 లక్షల ప్రయోజనం

EPF Account: పీఎఫ్ ఎక్కౌంట్‌తో సరికొత్త ప్రయోజనాలున్నాయి. ఒక్క దరఖాస్తు నింపుకుంటే చాలు..7 లక్షల వరకూ ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటి, ఏ దరఖాస్తు నింపాలనేది తెలుసుకుందాం..

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఖాతాతో చాలా ఇతర ప్రయోజనాలున్నాయి. ఈపీఎఫ్‌లో ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగుల కుటుంబానికి 7 లక్షల రూపాయల ప్రయోజనం అందుతుంది. ఇది పూర్తిగా ఇన్సూరెన్స్ స్కీమ్. పీఎఫ్ ఎక్కౌంట్ ఉన్న ఉద్యోగులంతా ఈ స్కీమ్‌కు అర్హులే. పీఎఫ్ ఎక్కౌంట్ కొనసాగుతున్న క్రమంలో ఆ ఉద్యోగి మరణిస్తే..కుటుంబసభ్యులకు 7 లక్షల రూపాయల భీమా అందుతుంది. అయితే ఈ స్కీమ్‌లో చేరాలన్నా లేదా ఈ ప్రయోజనాన్ని పొందాలన్నా ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్‌లో చేరాలంటే సంబంధిత ఉద్యోగులు ఇ నామినేషన్ పైల్ చేయాల్సి ఉంటుంది. అంటే నామినీ వివరాల్ని ఈపీఎఫ్ అక్కౌంట్‌లో నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లోనే నామినీ వివరాల్ని ఎంటర్ చేయవచ్చు. ఇ నామినేషన్ ద్వారా సులభంగా చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులంతా ఇ నామినేషన్ ఫైల్ చేసి కుటుంబసభ్యులకు సామాజిక భద్రత కల్పించాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది. 

ముందుగా ఈపీఎఫ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. తరువాత సర్వీస్ పై క్లిక్ చేయాలి ఇందులో ఫర్ ఎంప్లాయిస్ సెక్షన్ క్లిక్ చేస్తే.. Member UAN/Online Service ఆప్షన్ తెర్చుకుంటుంది. మెంబర్ ఈ సేవా పోర్టల్ ఓపెన్ అయిన తరువాత ఉద్యోగులు యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత manage ట్యాబ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో E Nomination సెలెక్ట్ చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు ఎంటర్ చేసిన తరవాత నామినీగా ఎవర్ని ఎంచుకుంటే వారి వివరాల్ని నమోదు చేయాలి. Add Family Detailsపై క్లిక్ చేసి వివరాలన్నీ సమర్పించాలి. ఒకరు లేదా ఎక్కువ మంది పేర్లు ఇవ్వవచ్చు. చివరిగా వివరాల్ని సరిచూసుకున్న తరువాత Save EPF Nominationపై క్లిక్ చేయాలి. ఆ తరువాత పేజీలో E Sign ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వన్‌టైమ్  OTP వస్తుంది. ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఈ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. అక్కడితే ఈ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయినట్టే.

Also read: Mosquito Prevention: దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఈ టెక్నిక్ పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News