Fruit facial for glowing skin: ఈ ఫ్రూట్‌ ఫెషియల్ ఇంట్లో చేసుకుంటే మీ ముఖానికి రెట్టింపు గ్లో..

 Fruit facial for glowing skin: అందంగా కనిపించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటాం. ముఖ సౌందర్యం పెంపొందించుకోవడానికి పార్లర్లకు వేల రూపాయలు ఖర్చుపెట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే సహజసిద్ధమైన పండ్లతో కూడా మనం ఇంట్లోనే ఫేషియల్ చేయించుకోవచ్చని మీకు తెలుసా?

Written by - Renuka Godugu | Last Updated : Jun 1, 2024, 12:54 PM IST
Fruit facial for glowing skin: ఈ ఫ్రూట్‌ ఫెషియల్ ఇంట్లో చేసుకుంటే మీ ముఖానికి రెట్టింపు గ్లో..

 Fruit facial for glowing skin: అందంగా కనిపించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటాం. ముఖ సౌందర్యం పెంపొందించుకోవడానికి పార్లర్లకు వేల రూపాయలు ఖర్చుపెట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే సహజసిద్ధమైన పండ్లతో కూడా మనం ఇంట్లోనే ఫేషియల్ చేయించుకోవచ్చని మీకు తెలుసా? అన్ని రకాల వయసు వారికి సెట్ అవుతుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే పండ్లతో మీరు ఫేషియల్ చేసుకోవచ్చు. సాధారణంగా పండ్లో విటమిన్ సి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖాన్ని మెరిపించడానికి ఆరోగ్యవంతంగా మీ స్కిన్ కనిపించడానికి వృద్ధాప్యం త్వరగా రాకుండా నివారిస్తుంది. చర్మం కూడా యవ్వనంగా సాగుతుంది.

పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వాతావరణ మార్పులకు మన చర్మాన్ని రక్షణగా నిలుస్తుంది. ముఖంపై ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. పండగలో హైడ్రేషన్ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇది మన చర్మానికి మంచి పోషణలను అందిస్తుంది. మాయిశ్చర్ నిలుపుతుంది. ఇంట్లో మనం చేసుకునే  ఫేషియల్ తో ఎక్కువ ఖర్చు ఏమీ ఉండదు. దీంతో పార్లర్ లాంటి మెరుపు కూడా పొందవచ్చు అంతేకాదు ఇది మీ చర్మానికి పునర్జీవనం అందిస్తుంది.

ఆరెంజ్ ఫ్రూట్ ఫేషియల్..
ఆరెంజ్ లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తాయి. ఆరేంజ్ ఫ్రూట్ ఫేషియల్ తయారు చేసుకోవడానికి ఒక ఆరెంజ్ మెత్తగా స్మాష్ చేసుకొని అందులో తేనె, పసుపు వేసి ఫేస్ ప్యాక్ లో తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ పై అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

స్ట్రాబెరీ ఫ్రూట్ ఫేషియల్..
స్ట్రాబెరీలో సలీసిలేక్ యాసిడ్, AHA ముఖంపై పిగ్మెంటేషన్ చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి. స్ట్రాబెరితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి అంటే స్ట్రాబెరీలను మ్యాష్‌ చేసి ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఒక టేబుల్ స్పూన్ హనీ వేసి ఫేస్ ప్యాక్ మాదిరి వేసుకోవాలి. ఈ స్ట్రాబెరీ ఫేస్ ప్యాక్ వేసుకున్న 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

కుకుంబర్ మిల్క్ ఫేషియల్..
ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకి, నార్మల్ స్కిన్ ఉన్నవారికి మంచి ఛాయిస్ కుకుంబర్ నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది మన చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది ముఖం యవ్వనంగా మెరుస్తుంది కుకుంబర్ తో ఫేషియల్ చేసుకోవాలంటే కుకుంబర్ ప్యూరీ, తేనె, పాలు బ్రౌన్ షుగర్ వేసుకొని తయారు చేసుకోవాలి ముఖానికి అప్లై చేసుకున్నాక 15 నిమిషాలకు ఫేస్ వాష్ చేసుకోవాలి.

 డ్రాగన్ ఫ్రూట్ ఫేషియల్..
డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖం సన్ బర్న్ సమస్యలను కూడా తగ్గిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ప్యూరీతో పెరుగు కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత సాధారణ నీటితో ఫేస్ వాష్ చేయాలి.

ఇదీ చదవండి:మీరు 24 గంటలు ఏసీ నడుపుతున్నారా? పేలుతుంది ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

 బనానా ఫ్రూట్ ఫేషియల్..
అరటి పండులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడి చర్మానికి మంచి పోషణ అందిస్తాయి. అరటిపండులను మ్యాష్‌ చేసి యోగార్ట్ ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేయాలి.

కివి ఫ్రూట్ ఫేషియల్..
కివిలో ఎక్కువ మోతాదులో విటమిన్ ఇ, విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి సాగే గుణాన్ని అందించి పునర్జీవనం అందిస్తుంది. కివి ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేయాలి.

ఇదీ చదవండి:కోల్డ్ బీట్‌రూట్‌ సూప్‌.. ఆరోగ్యవంతంగా రుచిగా ఇలా తయారు చేసుకోండి..

బొప్పాయి హనీ ఫేషియల్..
బొప్పాయి హనీ ఫేషియల్ ముఖానికి కాంతివంతం చేస్తుంది. బొప్పాయిలో పప్పేయిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసే గుణం కలిగి ఉంటుంది. బొప్పాయి పల్పులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవాలి 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేయాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News