#ZeeIndiaConclave: పకోడీ పాలిటిక్స్ చేసేవారు విజేతలు కాలేరు: అఖిలేష్

గోరఖ్ పూర్‌లో బీజేపీ అపజయం పాలవ్వడానికి కారణం వారు చేసిన  పకోడి పాలిటిక్స్ మాత్రమేనని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలిపారు. 

Last Updated : Mar 18, 2018, 06:24 AM IST
#ZeeIndiaConclave: పకోడీ పాలిటిక్స్ చేసేవారు విజేతలు కాలేరు: అఖిలేష్

గోరఖ్ పూర్‌లో బీజేపీ అపజయం పాలవ్వడానికి కారణం వారు చేసిన  పకోడి పాలిటిక్స్ మాత్రమేనని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ వల్లే బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ ఏకమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో పాటు జీఎస్టీని తీసుకురావడం తప్పించి బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. 

సమాజ్ వాదీ పార్టీ ఇంకా మాయావతి పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీతో కలిసి భవిష్యత్తులో ముందుకు వెళ్తుందా అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. మాయావతికి తన అత్తయ్యకు ఇచ్చినంత గౌరవాన్ని ఇస్తానని.. తామిరువురం కలిసి ప్రజల కోసం గుళ్లూ, గోపురాలు, మసీదులకెళ్లి ప్రార్థనలు చేస్తామని" అఖిలేష్ తెలిపారు. జాతీయ పాలిటిక్స్‌లోకి వెళ్లే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. అఖిలేష్ తనకు ఆ ఆసక్తి లేదని.. యూపీ ప్రజలకు సేవ చేయాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. 2017 ఎన్నికల గురించి మాట్లాడుతూ, బీజేపీ చేసిన కుటిల రాజనీతి వల్లే తమ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. 

Trending News