Corona Indian Strain: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. దేశం విలవిల్లాడుతోంది. ఇంతకీ ఇండియాలో విస్తరిస్తున్న కరోనా స్ట్రెయిన్ ఎటువంటిది..ఏ మేరకు ప్రమాదకరం..ఎంత వేగంగా సంక్రమిస్తోందనే వివరాల్ని వైద్య నిపుణలు విశ్లేషిస్తున్నారు.
కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఇండియాలో అత్యధికంగా 3 లక్షల 60 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక, మందులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ( Delhi) పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఆక్సిజన్ ( Oxygen Shortage) లభించక రోగుల ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియాలో ఇంతలా సంక్రమిస్తున్న వైరస్ ఏ మేరకు ప్రమాదకరం, ఎంత వేగంగా సంక్రమిస్తుందనే వివరాల్ని వైద్య నిపుణులు పరిశీలిస్తున్నారు.
కరోనా ఇండియన్ స్ట్రెయిన్‌ను (Cororna indian strain) బి 1.617 వేరియంట్‌గా ( B 1.617 variant) పిలుస్తున్నారు. ఇది యూకే వేరియంట్లా అత్యంత వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అయితే అది అత్యంత ప్రాణాంతకం అనేందుకు ఆధారాలు స్వల్పమేనని చెప్పారు. కరోనా వైరస్ బి 1.617 వేరియంట్‌ను డబుల్ మ్యూటెంట్ లేదా ఇండియన్ స్ట్రెయిన్‌గా పిలుస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ వేరియంట్ కన్పించింది. మహరాష్ట్రలో అయితే 50 శాతం పైగా కేసుల్లో కన్పించింది. యూకే వేరియంట్ (Uk variant) మాత్రం 28 శాతం కేసుల్లో కన్పించింది. యూకే వేరియంట్ కంటే అత్యంత వేగంగా సంక్రమించే వైరస్ ఇండియన్ స్ట్రెయిన్ అని చెబుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) లో మరణాలు పెరగడానికి కారణం అత్యంత వేగంగా విస్తరించే లక్షణమేనని తెలుస్తోంది. సాధారణంగా ఎంత ఎక్కువ మంది వ్యాధికి గురైతే అంత ఎక్కువ మందికి చనిపోయే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇండియన్ స్ట్రెయిన్‌లో మూడు రకాల సరికొత్త ప్రోటీన్ ఉత్పరివర్తనాలున్నాయని ఎన్సీబీఎస్ డైరెక్టర్ సౌమిత్ర దాస్ అంటున్నారు. అదే సమయంలో ఇండియన్ స్ట్రెయిన్ ప్రాణాంతకమనేందుకు ఎలాంటి ఆధారాల్లేవని చెప్పారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తున్నాట్టు తేలింది. ముఖ్యంగా బీ 1.617 వేరియంట్ పై కోవిషీల్డ్ వ్యాక్సిన్ (Covishield vaccine) ప్రభావవంతంగా పనిచేస్తుందని సీసీఎంబీ (CCMB) తెలిపింది.
Also read: Assam Earthquake: అస్సాంలో భారీ భూకంపం, వరుస ప్రకంపనలతో భారీ ఆస్తి నష్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook