West Bengal Bhabanipur bypoll Mamata Banerjee vs Priyanka Tibrewal: భవానీపూర్‌ ఉపఎన్నికలో దీదీకి పోటీగా లాయర్‌‌ ప్రియాంక, గట్టి పోటీనే ఇవ్వనున్నారా?

Priyanka Tibrewal vs Mamata Banerjee భవానీపూర్‌ నియోజకవర్గంలో మమత బెనర్జీని ఎదుర్కొనేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. భవానీపూర్‌ నుంచి తమ తరఫున న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ (Priyanka Tibrewal) పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 10, 2021, 03:45 PM IST
  • హాట్‌ టాపిక్‌గా మారిన భవానీపూర్‌ ఉప ఎన్నిక
  • భవానీపూర్‌ నుంచి పోటీకి దిగనున్న బీజేపీ అభ్యర్థిని ప్రియాంక
  • సంషేర్‌గంజ్‌, జాంగిపూర్‌ స్థానాల అభ్యర్థులనూ ప్రకటించిన బీజేపీ
West Bengal Bhabanipur bypoll Mamata Banerjee vs Priyanka Tibrewal: భవానీపూర్‌ ఉపఎన్నికలో దీదీకి పోటీగా లాయర్‌‌ ప్రియాంక, గట్టి పోటీనే ఇవ్వనున్నారా?

West Bengal bypoll BJP Fields Lawyer Priyanka : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి మళ్లీ మొదలైంది. భవానీపూర్‌తో (Bhabanipur) పాటు సంషేర్‌గంజ్‌, జాంగిపూర్‌ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) బరిలోకి దిగుతున్న భవానీపూర్‌ నియోజకవర్గం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్‌ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమత బెనర్జీ ఓడిపోయారు. అయితే భవానీపూర్‌ నుంచి తృణమూల్ నేత సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ పోటీ చేసి విజయం సాధించారు. నందిగ్రామ్‌లో(nandigram)మమత ఓడిపోయిన నేపథ్యంలో భవానీపూర్‌ సోభాందేవ్‌ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 

ఇక భవానీపూర్‌ నియోజకవర్గంలో మమత బెనర్జీని ఎదుర్కొనేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. భవానీపూర్‌ నుంచి తమ తరఫున న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ (Priyanka Tibrewal) పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. భవానీపూర్‌తో పాటు సంషేర్‌గంజ్‌, జాంగిపూర్‌ స్థానాల అభ్యర్థులను కూడా బీజేపీ ఖరారు చేసింది. సంషేర్‌గంజ్‌ నుంచి మిలన్‌ ఘోష్‌, జాంగిపూర్‌ నుంచి సుజిత్‌ దాస్‌ పోటీ చేస్తున్నట్లు బీజేపీ వెల్లడించింది.

Also Read : Mrunal Thakur: విరాట్‌ కోహ్లిని పిచ్చిగా లవ్ చేశాను: హీరోయిన్‌

ప్రియాంక నేపథ్యం ఇదీ

41ఏళ్ల ప్రియాంక టిబ్రివాల్‌ కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా (Lawyer) ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆమె 2014లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ యువ విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. గతంలో ఎంపీ బాబుల్‌ సుప్రియోకు న్యాయ సలహాదారుగా పనిచేశారు. 

దీదీకి గట్టి పోటీ ఇస్తారా

ఇక ఈ ఏడాది ఆరంభంలో జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతాల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు ప్రియాంక. అలాగే బెంగాల్‌ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల కేసును ఆమె వాదిస్తున్నారు. కాగా భవానీపూర్‌ నుంచి మమత బెనర్జీ (Mamata Banerjee) గతంలో రెండు సార్లు విజయఢంకా మోగించారు. ఈ సారి మరి ప్రియాంక దీదీకి గట్టి పోటీ ఇస్తారో లేదో వేచి చూడాలి.

Also Read : IAS Sameer Sharma: ఏపీ కొత్త సీఎస్‌గా సమీర్‌ శర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News