Women MLA Horse Riding: గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే, వీడియో వైరల్

International Women's Day 2022:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఎమ్మెల్యే వినూత్నంగా ఆలోచించారు. జార్ఖండ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్ర‌సాద్ మంగళవారం గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 03:32 PM IST
  • నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • మహిళా ఎమ్మెల్యే వినూత్న ఆలోచన
  • గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి ఎమ్మెల్యే, వీడియో వైరల్
Women MLA Horse Riding: గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే, వీడియో వైరల్

International Women's Day 2022:  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జార్ఖండ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ (Amba Prasad) మంగళవారం ఉదయం గుర్రంపై స్వారీ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు."ప్రతి మహిళలోనూ దుర్గా దేవి, ఝాన్సీ రాణి ఉంటుంది. మహిళలు పూర్తి శక్తిసామర్థ్యాలతో సవాళ్లను ఎదుర్కోవాలి. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలను తప్పనిసరిగా చదివించాలి" అనే సందేశం ఇచ్చారు అంబా ప్రసాద్.  ఈమె జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలోని బర్కాగావ్ అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గుర్రంపై వచ్చిన వీడియో నెట్టింట వైరల్ (Viral video) గా మారింది. 

ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా (International Women's Day)  ఘనంగా జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ప్రధాన లక్ష్యం మన సమాజంలో మహిళలను శక్తివంతం చేయడం మరియు ఆర్థిక, రాజకీయ, సామాజిక సహా వివిధ రంగాలలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం మరియు హక్కులపై వారికి అవగాహన కల్పించడం. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ 'సుస్థిరమైన రేపటి కోసం లింగ సమానత్వం నేడు'.

Also Read: Funny Video: జాయింట్ వీల్​ ఎక్కిన ఆ బుడ్డోడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News