Visaka Railway Zone: విశాఖ రైల్వే జోన్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. విశాఖ కేంద్రంగా ఎలాంటి జోన్ ఏర్పాటు కావడం లేదంటూ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఇవాళ కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రైల్వే జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఖండించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు.
దీనిపై కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. జోన్ ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. భూసేకరణ పూర్తి అయ్యిందని..భూమి కూడా అందుబాటులో ఉందన్నారు కేంద్రమంత్రి. నిన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా విభజన హామీలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈనేపథ్యంలోనే విశాఖ రైల్వే జోన్ ఉండదని..రైల్వే అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై రైల్వే బోర్డు అధికారులు స్పష్టత ఇచ్చారని ప్రచారం జరిగింది. కొత్త జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని..అందుకే రైల్వే జోన్ డీపీఆర్‌ను ఆమోదించలేదని తెలుస్తోంది. దీనిపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. హామీని కచ్చితంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి జోక్యం చేసుకుని..అధికారుల పరిధిలో కాకుండా కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం జరగాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
పత్రికల్లో వస్తున్న వార్తలను బీజేపీ నేతలు సైతం ఖండిస్తున్నారు. ఇలాంటివన్నీ అసత్యలేనని కొట్టిపారేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ రావడం ఖాయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం వస్తున్న వార్తలను ఖండించారు. రైల్వే జోన్ ఏర్పాటు దిశగా పనులు జరుగుతున్నాయని తేల్చి చెప్పారు. గతంలో దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చిందని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌పై వస్తున్న వార్తలను ప్రజలను నమ్మొద్దని సూచించారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం క్లారిటీ ఇచ్చింది. త్వరలో విశాఖ రైల్వే జోన్ పనులు జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. ఐతే దీనిని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఖండిస్తోంది. విభజన హామీలపై నాటకాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు.
Also read:ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో యువ మిస్టర్ 360 జోరు..తాజా స్థానం ఎంతంటే..!
Also read:Free Ration Scheme: పేదలకు గుడ్‌న్యూస్..ఉచిత రేషన్ పంపిణీ ఎప్పటి వరకంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి