Brave Kerala Cop: కత్తితో దుండగుడు దాడి చేస్తున్నా భయపడని పోలీస్.. వైరల్ వీడియో

Brave Kerala Cop: అగంతకుడి దగ్గర కత్తి ఉంది.. అతన్ని పట్టుకునేందుకు వచ్చిన పోలీసు దగ్గర ఏ ఆయుధం లేదు. తన దగ్గరకు వస్తున్న పోలీస్ పై దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు. అయినా ఆ పోలీస్ ఏ మాత్రం జంకలేదు. కత్తితో దాడి చేస్తున్నా భయపడకుండా ఎంతో ధైర్యంగా అతని దగ్గరకు వెళ్లాడు

Written by - Srisailam | Last Updated : Jun 20, 2022, 09:53 AM IST
  • కేరళలో బ్రేవ్ పోలీస్ అధికారి
  • కత్తితో దాడి చేస్తున్నా విరోచిత పోరు
  • వైరల్ గా మారిన ఎస్ఐ వీడియో
Brave Kerala Cop: కత్తితో దుండగుడు దాడి చేస్తున్నా భయపడని పోలీస్.. వైరల్ వీడియో

Brave Kerala Cop: అగంతకుడి దగ్గర కత్తి ఉంది.. అతన్ని పట్టుకునేందుకు వచ్చిన పోలీసు దగ్గర ఏ ఆయుధం లేదు. తన దగ్గరకు వస్తున్న పోలీస్ పై దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు. అయినా ఆ పోలీస్ ఏ మాత్రం జంకలేదు. కత్తితో దాడి చేస్తున్నా భయపడకుండా ఎంతో ధైర్యంగా అతని దగ్గరకు వెళ్లాడు. విరోచితంగా పోరాడాడు. దుండగుడిని పట్టేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. కత్తితో దాడికి యత్నించిన దుండగుడితో పోరాడిన పోలీస్ అధికారిపై ప్రశంసల జల్లు కరుస్తోంది. రియల్‌ హీరోలు ఇలాగే ఉంటారంటూ నెటిజన్లు కొనియాడారు.

రళ రాష్ట్రంలో జరిగింది ఈ ఘటన. అలప్పుజ జిల్లా కాయంకులమ్‌లోని పారా జంక్షన్‌ వద్ద రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వాళ్లకు ఓ వ్యక్తి అనుమానాస్పందగా కనిపించాడు. దీంతో అతని ముందు తమ వాహనం ఆపారు పెట్రోలింగ్ పోలీసులు. జీపు నుంచి దిగిన ఎస్సై దుండగుడి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఎస్ఐని గమనించిన అగంతకుడు తన దగ్గర ఉన్న కత్తిని తీశాడు. దాంతో ఎస్ఐపై దాడికి దిగాడు. పొడవైన కత్తితో దుండగుడు తనపై దాడికి దిగినా... ఎస్ఐ ఏమాత్రం జంకలేదు. ప్రాణాలకు లెక్కచేయకుండా అతనితో తలపడ్డాడు. పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరూ కిందపడ్డారు. అయినా దుండగుడిని విడవకుండా పట్టేశాడు ఎస్ఐ. దుండగుడి చేతిలోని కత్తిని స్వాధీనం చేకుసుని అతన్ని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనలో ఎస్సై చేతికి గాయం కాగా.. ఏడు కుట్లు పడ్డాయి. దుండగుడితో పోరాడిన ఎస్సై వివరాలను కేరళ పోలీసులు ప్రకటించారు. విరోచిత పోలీస్ అధికారి పేరు అరుణ్ కుమార్. అలప్పుజ జిల్లా నూరానడ్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌ఛార్జిగా పని చేస్తున్నారు.

Read also: Bharat Bandh: ఆగని అగ్నిపథ్ అల్లర్లు.. భారత్ బంద్ తో హై అలర్ట్! బీహార్ లో ఇంటర్నెట్ సేవలు కట్..

Read also: Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. ఇంటి గోడ కూల్చివేతపై 'స్టే' ఇచ్చిన హైకోర్టు...  

Also read:Konda Film: రేవంత్ రెడ్డి పులి.. దయాకర్ రావుకు డైపర్లే! తీన్మార్ పంచ్ లతో కొండా డాటర్ పొలిటికల్ ఎంట్రీ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News